శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By Selvi
Last Updated : బుధవారం, 9 జులై 2014 (16:14 IST)

ఇల్లు చిందరవందరగా ఉంటే యజమానికి కష్టాలేనట!

గృహాలంకరణలో మీ పాటించాల్సిన అంశం ఇదే. ఇంట్లోని వస్తువులను ఎక్కడపడితే అక్కడ చిందరవందరగా పడేయకూడదు. అంతేకాదు.. ఇంటి అలమరాలు శుభ్రంగా ఉండాలి. పుస్తకాలను అమర్చడం, గృహాలంకరణ వస్తువులతో అలంకరించడం చేయాలి. ఫోటోల పక్కన రోజూ ఉపయోగించే వస్తువులను ఉంచకూడదు. 
 
షో కేజ్ ఎప్పుడూ అందంగా కనిపిస్తూ వుండాలి. ఫర్నిచర్‌లపై దుస్తులు వేలాడకూడదు. సోఫా సెట్‌లను నీట్‌గా అమర్చుకోవాలి. చిందరవందర ఎల్లప్పుడూ మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. తద్వారా సానుకూల ఫలితాలు ఉండవని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. అందువల్ల ఎప్పుడూ మీ ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించండి. 
 
గదుల్లో అల్మారాలతో పుస్తకాలను నిలువు స్పేస్ ఉంచండి. ఇతర ప్రాంతాల్లో వీలైనంత చిందరవందర చేయటం తగ్గించండి. ఇలా చేస్తే సానుకూల ఫలితాలుంటాయని, ఇంటి యజమానికి ఆర్థిక సమస్యలు తలెత్తవని ఫెంగ్ షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.