శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (15:41 IST)

బతుకమ్మ పండుగ.. గాజుల గలగలలు, పూల సుగంధాలు..

Bathukamma
భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వీయుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు ప్రతీ ఆడపిల్ల తన పుట్టింట అక్కా చెల్లెళ్లు, చిన్ననాటి స్నేహితులతో ఈ పండుగ జరుపుకొంటుంది. 
 
గాజుల గలగలలు, పట్టుచీరల రెపరెపలు, ఆభరణాల అందాలు, పూల సుగంధాలు, ఎటు చూసినా ఇంతుల అందాలు హరివిల్లులా పల్లె అందాన్ని ఇనుమడిస్తాయి. 
 
పూర్వం నుంచీ ఉన్న సంప్రదాయం ఇది. కాకతీయులు తమ కులదేవత ముంగిట గుమ్మడి పూలతో పూజించేవారట. బతుకమ్మ చోళుల కాలంలోనూ ఉండేదని పురాణాలు చెప్తున్నాయి. బతుకమ్మ పండుగ భూమి, నీరు ప్రకృతిలో ఇతర వాటి మధ్య సంబంధాన్ని తెలుపుతూ జరుపుకునే పండుగ. 
 
కరువు నుంచి కాపాడాలని ప్రజలు గౌరమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కరువు నుంచి కాపాడాలని ప్రజలు గౌరమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకూ బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి.