పితృదోషాలను తొలగించుకోవాలంటే.. మహాలయ అమావాస్య నాడు ఇలా చేయండి..

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (15:15 IST)

పితృదోషమనేది ఈతిబాధలను కలిగింపజేస్తుంది. ఇంట్లో వున్నవారికి ఆర్థిక ఇబ్బందులు, యాక్సిడెంట్లు జరగడం, అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం, పిల్లల్లో అప్రవర్తన, దుర్గుణం, మానసిక వ్యాధులు, వివాహాల్లో జాప్యం, విడాకులు, సంతానలేమి, కెరీర్‌లో ఉన్నత స్థితికి చేరుకోకపోవడం, అనుకున్న కార్యాలు జరగకపోవడం వంటి కారణాలు పితృదోషానికి సంబంధించినవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇలాంటి కారణాలతో మీరూ ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లైతే వెంటనే పితృదోష నివారణ చేయించండి. పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వండి. 
 
ప్రతినెలలో వచ్చే అమావాస్య రోజున పితృదేవతలను పూజించండి. అలా కుదరకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య రోజున పూజ చేయండి. పండితుల సూచన మేరకు నదీ ప్రాంతాలు, చెరువుల వద్ద నియమాల ప్రకారం శ్రాద్ధం ఇవ్వండి. పితృపక్షంలో వచ్చే సర్వపితృ అమావాస్య అయిన మహాలయ అమావాస్య నాడు మీ పితృలు ఏ తిథిలో మరణించినా ఆ రోజున శ్రాద్ధం ఇవ్వడం మరవకూడదు. 
 
ఇలా పితృదేవతలను పూజించినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. జీవిత లక్ష్యాన్ని చేరుకుంటారు. మహాలయ అమావాస్య రోజున నదుల వద్ద ఏర్పాటు చేసిన పూజా మండపంలో ఇచ్చే దుస్తులను ధరించాలి. పూజ కోసం రాగి పాత్రలను ఉపయోగించాలి. అరటి ఆకులను ఉపయోగించాలి. పితృదేవతలకు నైవేద్యంగా పాయసం, అన్నం, పప్పు, పసుపు గుమ్మడి ముక్కలను సమర్పించాలి. ఈ ఏడాది మహాలయ అమావాస్య 19వ తేదీ (సెప్టెంబర్) వస్తోంది.
 
అమావాస్య పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా జీవితంలో సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి.. అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి. లేకుంటే కనీసం నీరైన వదలాలి.
 
అలా నదుల చెంత చేయలేకపోతే.. ఇంట్లో పూజగదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ అన్నంలో కాస్త కాకులకు ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు మనం పెట్టిన ఆహారాన్ని తీసుకుంటారని విశ్వాసం. 
 
ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు. సాధారణంగా పితృదేవతలు ఏడుగణాలుగా వుంటారని.. తొలి మూడు గణాల వారు దేవతలు అమూర్తులుగా.. అంటే ఆకారం లేనివారుగా ఉంటారు. మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం ఆకారాలుంటాయి. పితృగణాలు దేవుళ్లతో కలిసి శ్రాద్ధాన్ని భుజిస్తాయని, భోజనంతో సంతృప్తి చెంది శ్రాద్ధదాతకు సుఖ, సంతోషాలను ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
పితృదేవతలను పూజిస్తే.. వారికి నైవేద్యాలు సమర్పిస్తూ.. సుఖంగా ఉంచుకుంటే… తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయని, ఈతిబాధలు ఉండవని, అందుకే అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పితృదేవతలను పూజించి వారి శ్రాద్ధం ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. 



దీనిపై మరింత చదవండి :  
Significance Sarvapitru Amavasya 19th September 2017 Food Offerings Pitra Dosha Mahalaya Amavasya 2017: Dates

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

నవరాత్రి స్పెషల్ : కట్టె పొంగలి ఎలా చేయాలి..

ముందుగా కుక్కర్లో బియ్యం, పెసరపప్పును కడిగి రెండింతలు నీరు పోసి ఉడికించుకోవాలి. రెండు ...

news

తిరుమలలో వేంకటేశ్వరుని ఆగ్రహం... ఏం జరిగిందో తెలుసా?!

కలియుగ వేంకటేశ్వరస్వామి ఆగ్రహం చెందడమేంటి.. ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారా.. ...

news

నవరాత్రులు.. ఐదో రోజున స్కందమాత పూజ(వీడియో)

నవరాత్రుల్లో ఐదో రోజున (సెప్టెంబర్ 25) దుర్గా మాత స్కంద మాత అవతారంలో దర్శనమిస్తారు. ఈ ...

news

తిరుమలలో ఎవరు విఐపి.. తెలుసా...?

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం, సేవల నిమిత్తమై తిరుమలకు వచ్చే ...