సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 14 మార్చి 2022 (09:26 IST)

అమలక ఏకాదశి అంటే ఏమిటి? ఏం చేయాలి?

మార్చి 14, సోమవారం ఈ రోజు అమలక ఏకాదశి. ఏడాది 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో వేటికవే ప్రత్యేకమైనవిగా వుంటాయి. ఇక ఫల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ప్రాముఖ్యత ఏమిటంటే.... ఈరోజు విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో కొలువై వుంటారట.

 
అంతేకాదు... ఆ మూర్తితో పాటు శ్రీలక్ష్మిదేవి, కుబేరుడు కూడా ఉసిరి చెట్టుకి సమీపంలో వుంటారట. అందువల్ల ఈరోజు ఉపవాసం వుండి శ్రీమన్నారాయణుడిని భక్తితో పూజిస్తే అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. అలాగే ఈ రోజు ఎలాంటి దానం చేసినా పుణ్యం కలుగుతుంది.

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
 
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం!!