శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 4 జులై 2017 (05:26 IST)

జీఎస్టీతో ఒక్క దేశం కూడా బాగుపడిన దాఖలా లేదు. ఇండియాను ఏం చేయదలిచారు?

ప్రపంచంలో దాదాపు 150 దేశాలు జీఎస్టీ ద్వారా ఆదాయ వనరులు పెంచుకుంటున్నాయని మన పాలకవర్గాల భ్రమ. కానీ ఆయా దేశాలలో పాలకవర్గాలు ఎందుకు పతనమైనాయో మాత్రం వారు ఆలోచించడం లేదు. జీఎస్టీని అమలులోకి తెచ్చే ముందు ఆయా దేశాలు ఎన్నేళ్ల పాటు ప్రయోగ దశకే పరిమితం కావలసి

ప్రపంచంలో దాదాపు 150 దేశాలు జీఎస్టీ ద్వారా ఆదాయ వనరులు పెంచుకుంటున్నాయని మన పాలకవర్గాల భ్రమ. కానీ ఆయా దేశాలలో పాలకవర్గాలు ఎందుకు పతనమైనాయో మాత్రం వారు ఆలోచించడం లేదు. జీఎస్టీని అమలులోకి తెచ్చే ముందు ఆయా దేశాలు ఎన్నేళ్ల పాటు ప్రయోగ దశకే పరిమితం కావలసి వచ్చిందో కూడా వీరికి అవసరం లేదు. భారత పాలకవర్గాలు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న అమెరికాయే జీఎస్టీని తిరస్కరించిన విషయాన్ని గుర్తించాలి. 
 
ఫ్రాన్స్‌లో 20 శాతం వద్ద రేటును స్థిరపరిచి 10 శాతానికి కోతపెట్టక తప్పలేదు. బ్రిటన్‌లో స్టాండర్డ్‌ రేటు 20 శాతం కాగా దాన్ని 15 శాతానికి, మలేషియా జీఎస్టీ రేటు 6 శాతానికి, సింగపూర్‌ రేటు 7 శాతానికి కుదించుకోవలసి వచ్చింది. ఈ వాతావరణంలో ఇండియా జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 28 శాతానికి ‘హనుమంతుడి తోకలా’ పెరిగిపోయింది. కాగా, జీఎస్టీ రేట్లవల్ల పొంచి ఉన్న మరొక ప్రమాదం– నోట్ల ముమ్మరంద్రవ్యోల్బణం. అలాగే జీఎస్టీ వల్ల పన్నుల ఎగవేత నేరాలు తగ్గిపోతాయని మరొక భ్రమ. ఫ్రాన్స్‌ అయినా, అక్కడి కార్పొరేట్లు పన్ను ఎగవేతలు ఎందుకు ఆగిపోలేదు
 
కొన్ని దేశాల్లో జీఎస్టీకి బదులు మనలాగానే ఇప్పటిదాకా వ్యాట్‌ కొనసాగుతూ ఉంది. కానీ జీఎస్టీ ద్వారా పెక్కు దేశాలు అస్తవ్యస్త పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. దీని జన్మస్థానం ఫ్రాన్స్‌లోను, కెనడాలోనూ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ పన్ను అమలులోకి వచ్చిన తర్వాత కెనడా అనేకసార్లు జీఎస్టీ రేట్లు తగ్గించుకోవలసి వచ్చింది. అయినా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ భారీ పరోక్ష పన్నుల విధానంవల్ల ఇండియాలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికలే హెచ్చరిస్తున్నాయి. 
 
మరో చిత్రమైన సంగతేమంటే– జీడీపీని అమలు చేస్తున్న క్రమంలో అంతకుముందు సింగపూర్‌ జాతీయోత్పత్తుల అభివృద్ధి సూచి 1991లో 5.5 శాతం ఉండగా, 1994లో అది 3 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం దంచికొట్టింది. ఫలితంగా ప్రభుత్వ పతనాలు, ప్రజలకు ఇబ్బందులు. జీఎస్టీ కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు కోర్టులదాకా కొన్ని కెనడా రాష్ట్రాల్లో పాకారంటే పాలకుల నిరంకుశ నిర్ణయాలే కారణమై ఉండాలి. 
 
కార్పొరేట్‌ ప్రయోజనాలను ప్రధానంగా కాపాడ్డానికీ, ప్రజా బాహుళ్యంపై భారీ పరోక్ష పన్నుల భారాన్ని మోపడానికి కూడా జీఎస్టీని తీసుకొచ్చారు. పబ్లిక్‌ (ప్రభుత్వ) రంగ సంస్థల్ని క్రమంగా మూసివేయాలని కూడా కార్పొరేట్ సంస్థలు దరువేస్తున్నాయి. 
 
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య రైతాంగం, ఉద్యోగులు, చిన్న మధ్య తరగతి వ్యాపారులు, వృత్తుల వారు కుదేలయ్యారు. బ్యాంకులలో ఉన్న తమ పైకాన్ని సయితం తీసుకునే అవకాశం లేక వారు యాతన పడ్డారు. అప్పుడు యూపీ ఎన్నికల కోసం పెద్ద నోట్ల రద్దును ఆదరాబాదరాగా తెచ్చినట్టే, ఇప్పుడు 2018–19 ఎన్నికల కోసం జీఎస్టీని ఎరగా చూపుతున్నారని అనిపిస్తున్నది.