మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (08:23 IST)

42 శాతం పెరిగిన వంట గ్యాస్ ధర - 92 శాతం తగ్గిన రాయితీ

gas cylinder boy
దేశంలో వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 500 నుంచి 700 రూపాయల మేరకు ఉన్న ఈ వంట గ్యాస్ ధరలు ఇపుడు ఏకంగా 1000 నుంచి 1200 రూపాయలకు చేరుకున్నాయి. ముఖ్యంగా, గత ఐదేళ్ల కాలంలో వీటి ధరలు 42 శాతం మేరకు పెరిగాయి. అదేసమయంలో వంటగ్యాస్ లబ్దిదారులకు కేంద్రం ఇచ్చే రాయితీ మొత్తంలో మొత్తం ఏకంగా 92 శాతం మేరకు తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి రామేశ్వర్ ఠాకూర్ వెల్లడించారు. 
 
గత 2018 జనవరి ఒకటో తేదీన 14.2 కేజీల గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.741 ఉండేది. ఇపుడు దీని ధర రూ.1053కు చేరింది. అంటే 42.10 శాతం మేరకు పెరిగినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అదేసమయంలో ఎల్పీజీ సిలిండర్లపై కేంద్రం ఇచ్చే రాయితీ మాత్రం 92 శాతం మేరకు తగ్గిపోయింది. 
 
గత 2017-18 మధ్యకాలంలో ఈ సబ్సీడీ మొత్తం విలువ రూ.23,464 కోట్లుగా ఉండగా, 2021-22 నాటికి రూ.1811 కోట్లకు తగ్గినట్టు తెలిపారు. ఐదేళ్ల కాలంలో ఎల్పీజీ సబ్సీడీ పొందే వారి సంఖ్య 20,21,20,070 నుంచి 28,36,77,886కు అంటే 40.35 శాతం మేరకు పెరిగినట్ట ఆయన తెలిపారు. 
 
అదేవిధంగా పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న పన్నుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయం గత ఐదేళ్లలో 46 శాతం మేరకు వృద్ధి చెందగా, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంలో పెరుగుదల 36 శాతంగా ఉందని ఠాకూర్ వివరించారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ.31,21,173 కోట్ల మేరకు ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించారు.