శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 అక్టోబరు 2023 (22:54 IST)

టాటా మోటార్స్ కార్పొరెట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు: దశాబ్ది కాలంలో 60 లక్షల మందికి వెన్నుదన్ను

image
భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ఈరోజు తన 9వ వార్షిక సీఎస్ఆర్ నివేదికను విడుదల చేసింది. ఆరోగ్యం (ఆరోగ్య), విద్య (విద్యాధనం), ఉపాధి (కౌశల్య), పర్యావరణం (వసుంధర) రంగాలలో భారతదేశపు అత్యంత క్లిష్టమైన, సామాజిక సవాళ్లను పరిష్కరించేందుకు తన విస్తృత ప్రయత్నాలను చాటిచెప్పింది. సమష్టిగా, ఈ ప్రయత్నాలు గత 10 సంవత్సరాలలో 60 లక్షల కంటే ఎక్కువ మంది జీవితాలకు ప్రయోజనం చేకూర్చాయి. ఈ లబ్దిదారులలో అట్టడుగు వర్గాలకు చెందిన వారు గణనీయమైన శాతం మంది ఉన్నారు.
 
2014లో, టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా తన సీఎస్ఆర్ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి సమగ్ర 4-స్తంభాల విధానాన్ని రూపొందించింది, అనుసరించింది. గుర్తించబడిన ప్రతి రంగంలో వ్యక్తిగత యూనిట్లు, బృందాలు పొందిన సామర్థ్యాలు, అనుభవం, నైపుణ్యం స్పష్టంగా నిర్వచించబడిన ఫలితాలు, విశేషమైన ఫలితాలతో కేంద్రీకృత జోక్యాల సృష్టి, అమలుకు దారితీశాయి. ఆయా ప్రాంతాలలో కార్యక్రమాలను సమన్వయం చేయడం ద్వారా, డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించుకోవడం, విభిన్న వాటాదారులతో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సమూహాలతో నమ్మకాన్ని బలోపేతం చేయడం ద్వారా, కంపెనీ తను అంచనా వేసిన ప్రభావాన్ని సమర్థవంతంగా అధిగమించింది.
 
ఈ సందర్భంగా టాటా మోటార్స్ సీఎస్ఆర్ విభాగాధిపతి శ్రీ వినోద్ కులకర్ణి మాట్లాడుతూ, “టాటా మోటార్స్‌‌లో, మా సీఎస్ ఆర్ ప్రయత్నాలు సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి మా అచంచలమైన నిబద్ధతతో లోతుగా పాతుకుపోయాయి, తద్వారా అవి దేశ నిర్మాణానికి దోహదపడతాయి. మా ప్రయత్నాల ద్వారా లక్షలాది మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసినందుకు మేం గర్విస్తున్నాం. వాస్తవానికి, మా అనేక సీఎస్ఆర్ ఆలోచనలు,  ప్రోగ్రామ్‌లు సమాజ అభివృద్ధికి నమూనాలుగా అనుకరించటానికి విలువైన ప్రాజెక్ట్‌‌లుగా మారాయి. 'మోర్ ఫర్ లెస్ ఫర్ మోర్' అనే వినూత్న విధానాన్ని ఉపయోగించి మేం మా ఆకాంక్షలు, అందుబాటులో ఉన్న వనరుల మధ్య అంతరాన్ని తగ్గించాం. అనేక ప్రాజెక్టులకు దేశ వ్యాప్త స్థాయిని సాధించాం. మరింత సమగ్రమైన, సమానమైన, సుస్థిరమైన భారతదేశాన్ని రూపొందించడానికి మేం ప్రయ త్నిస్తున్నందున, మా సీఎస్ఆర్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో మా నిబద్ధత స్థిరంగా ఉంటుంది. కచ్చితమైన ప్రణాళిక, మా ఆర్థిక, మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా, మేం గడిచేపోయే ప్రతి సంవత్సరం క్రమ క్రమంగా గొప్ప ప్రభావాన్ని చూపాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.
 
గత పదేళ్లలో కన్వర్జెన్స్, పరిమాణం, చేరిక పరంగా గణనీయమైన ప్రభావాన్ని చూపిన ఆరోగ్యం, విద్య, ఉపాధి, పర్యావరణ రంగాలలో కంపెనీ ఎంచుకున్న భారీ ప్రాజెక్ట్‌‌ల గురించి  ఇక్కడ వెంటనే తెలుసుకోవచ్చు.
 
కమ్యూనిటీ ఆధారిత జోక్యాల ద్వారా పోషకాహార లోపాన్ని పరిష్కరించడం
పిల్లల్లో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడంలో టాటా మోటార్స్ గణనీయమైన పురోగతి సాధించింది. సంస్థాగత-ఆధారిత క్లినికల్ విధానాల నుండి కమ్యూనిటీ-ఆధారిత ఆరోగ్య జోక్యాలకు తన దృష్టిని మరల్చడం ద్వారా, కంపెనీ సుస్థిర మైన ప్రభావాన్ని సృష్టించగలిగింది. లక్ష్యంగా నిర్దేశించుకున్న కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన పోషకాహార లోపం, మధ్యస్తంగా తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, కంపెనీ గత దశాబ్ది కాలంలో పోషకాహార లోపం ఉన్న పిల్లలను 91% కంటే ఎక్కువ మందిని ఆరోగ్యకరమైన స్థాయిలకు విజయవంతంగా తరలించింది.
 
సత్వర గుర్తింపు మరియు సంరక్షణతో కుష్టు రోగులకు సాధికారత
కుష్టు వ్యాధి గురించి అవగాహన పెంచడంలో, బాధిత వ్యక్తులకు ముందస్తుగా గుర్తించి సంరక్షణ అందించడంలో టాటా మోటార్స్ చురుకుగా పాల్గొంటోంది. చేరుకోవడానికి కష్టతరమైన గ్రామాలలో వార్షిక ఇంటింటి అవగాహన ప్రచారాల ద్వారా, సంస్థ వేలాది ఇళ్లలో పరీక్షలు నిర్వహించింది. 4,000 మంది కుష్టు రోగులను గుర్తించి చికిత్సను అందించింది. వ్యాధి ఎక్కువగా ఉన్న ఝార్ఖండ్‌లో సంస్థ కమ్యూనిటీ ఆధారిత లెప్రసీ కార్యక్రమం, ఈ వ్యాధిని నిర్మూలించడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించబడింది.
 
డిజిటల్ సాధికారత ద్వారా చదువు అంతరాన్ని తగ్గించడం
టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ రిమోట్ లెర్నింగ్ ప్రోగ్రాం, ENABLE అనేది 550 కంటే ఎక్కువ జవహర్ నవోదయ విద్యాలయాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు అగ్రశ్రేణి ఇంజనీరింగ్, మెడికల్ సంస్థలలో ప్రవేశానికి వనరులు, మార్గనిర్దేశం అందిం చడంలో సహాయపడింది. గత దశాబ్ది కాలంలో ఈ కార్యక్రమం వెనుకబడిన నేపథ్యాలకు చెందిన 20,000 మందికి పైగా ఔ త్సాహికులకు ప్రయోజనం చేకూర్చింది. వీరిలో చాలా మంది IITలు, AIIMS, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంజినీరింగ్, మెడి కల్ కాలేజీలలో అడ్మిషన్లు పొందారు. అంతేగాకుండా, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో IX, X తరగతుల విద్యార్థులకు డిజిటల్, ఇన్-పర్సన్ మోడ్‌లను ఉపయోగించి సపోర్ట్ క్లాసులు నిర్వహించబడుతున్నాయి. ఈ విధానం ఉత్తీర్ణత రేటు, విద్యా పని తీరును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా నిరూపించబడింది. ముఖ్యంగా, ఈ నమూనా మహారాష్ట్రలోని థానే, బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పరిధిలోని సుమారు 200 పాఠశాలల్లో విజయవంతంగా అమలు చేయబడింది.
 
ఉజ్వల భవిష్యత్తు కోసం నిరుద్యోగ యువత నైపుణ్యం        
టాటా మోటార్స్ ద్వారా కౌశల్య కార్యక్రమంలో భాగమైన లీప్ ప్రోగ్రామ్, నిరుద్యోగ యువత నైపుణ్యం పెంచడంపై, ముఖ్యంగా ఆటోమోటివ్ కోర్సులలో, వర్క్‌ ఫోర్స్‌ లోకి వారి ప్రవేశాన్ని సులభతరం చేయడంపై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమం యువతులు మూస పద్ధతులను అధిగమించి ఆర్థిక స్వాతంత్ర్యం పొందేలా చేసింది. గత దశాబ్దంలో, ఈ నైపుణ్య కార్యక్రమం 2 నుండి 60 ఇన్‌స్టిట్యూట్‌లకు పెరిగింది. సుమారు 85% మంది ట్రైనీలు రూ.15000 నుండి 18000 వరకు  సగటు జీతంతో ప్లేస్‌మెంట్ పొందారు. తద్వారా ఇది వారి జీవితాలు, ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది.
 
గ్రామీణ- పట్టణ అటవీ కవర్‌ను పునరుద్ధరించడం- విస్తరించడం
ఆగ్రో-ఫారెస్ట్రీ ప్లాంటేషన్ ద్వారా రైతులకు సుస్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, ప్రభుత్వ కన్వర్జెన్స్‌‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఉపయోగించని భూమిని సాగుకు యోగ్యమైన ప్రాంతాలుగా మార్చే లక్ష్యంతో, కంపెనీ దాదాపు 1 మిలియన్ మొక్కలను విజయవంతంగా నాటింది, వాటిలో 90% మనుగడకు భరోసా ఇస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో, అదనంగా ఒక మిలియన్ మొక్కలను నాటడానికి ప్రణాళిక రూపొందించబడింది.
 
అటవీ విభాగం (GOI), TERRE పాలసీ సెంటర్ సహకారంతో, వార్జే (పుణే పట్టణం)లో 16.5 హెక్టార్ల అటవీ భూమిలో గణనీయమైన విస్తరణ జరిగింది. ఈ కార్యక్రమం వైవిధ్యమైన వృక్షజాలం, జంతుజాలానికి మద్దతు ఇచ్చే సూక్ష్మ-ఆవాసాల సృష్టికి దారితీసింది. గత దశాబ్ది కాలంలో ప్రాజెక్ట్ 200 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించింది, పట్టణ అటవీ విస్తీర్ణాన్ని పునరుద్ధరించడానికి, జీవవైవిధ్య పరిరక్షణకు దోహదపడింది.
 
నీటి భద్రత
ఈ సంవత్సరం, కంపెనీ ప్రతిష్టాత్మకంగా 100 అమృత్ సరోవర్ లను ఒక కోటి లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో రూపొందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ను ప్రకటించింది, ఇది పాల్ ఘర్ జిల్లాలోని 75 ప్రాంతాలు, పుణె & సతారా జిల్లాలోని 25 ప్రాంతాలలో నీటి లభ్యతను మెరుగుపరిచింది.