2021 విశ్వసుందరిగా హర్నాజ్ సంధు
చండీగఢ్‌కు చెందిన 21 ఏళ్ల మోడల్ హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని మన దేశానికి 21 ఏళ్ల తర్వాత తెచ్చింది. ఇంతకుముందు, లారా దత్తా 2000లో టైటిల్‌ను గెలుచుకోగా, సుస్మితా సేన్ 1994లో కిరీటాన్ని కైవసం చేసుకుంది. సంధుకు మెక్సికోకు చెందిన మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా కిరీటాన్ని అందజేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
తను జంతువు అరుపును అనుకరించడంపై హర్నాజ్ తక్కువగా భావించడంలేదని తెలిపింది. జంతువుల పట్ల తనకున్న ప్రేమను విశ్వవ్యాప్తంగా తెలియజేసే అవకాశాన్ని మిస్ యూనివర్స్ హోస్ట్ తనకు కల్గించాడని చెప్పుకొచ్చింది.