శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By ttdj
Last Modified: శనివారం, 28 జనవరి 2017 (16:04 IST)

దేవుడి ఉంగరాన్ని ఏ స్థితిలో ధరించాలో తెలుసా?

మనలో చాలామంది ఉంగరాల్లో చైన్‌లలో దేవుడి ప్రతిమలు ఉంచుకుంటారు. ఉదయాన్నే లేచి కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవడం లాంటివి చేస్తారు. ఆ ప్రతిమలలో దైవత్వం ఆపాదించుకుంటాం. అసలు దేవుడి ఉంగరాలు ఎలా ధరించాలి? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

మనలో చాలామంది ఉంగరాల్లో చైన్‌లలో దేవుడి ప్రతిమలు ఉంచుకుంటారు. ఉదయాన్నే లేచి కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవడం లాంటివి చేస్తారు. ఆ ప్రతిమలలో దైవత్వం ఆపాదించుకుంటాం. అసలు దేవుడి ఉంగరాలు ఎలా ధరించాలి? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
 
ఉంగరాలు కాని, గొలుసులుగాని దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు చేయించి జాతక రీత్యా ధారణ చేయాలి. అలా చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది. అప్పుడు సాక్షాత్తు భగవంతుడు మనవెంటే ఉన్నట్లు. అయితే ఇక్కడ ఉంగరం ధరించిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం ఉంటాయి.
 
ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు కాళ్ళు గోర్లవైపు ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం చేతివేళ్ళు, గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి. కళ్ళకు అద్దుకునేటప్పుడు గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి. ఇక స్త్రీలు అయితే బహిష్టు సమయం కంటే ముందే ఉంగరాలు, లాకెట్లు తీసి భద్రపరుచుకోవాలి. ఆ సమయంలో ధరించకూడదు. అంతేకాదు భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు. మాంసాహారం భుజించకూడదు. ఎందుకంటే మాంసాహారం తినేటప్పుడు ఆ మాంసం దేవుడి ప్రతిమకు తగులుతుంటే ఒక్కసారి ఊహించుకోండి, మనం ఎంత తప్పు చేస్తున్నామో?
 
ఇక మగవారు ధూమపానం చేసేటప్పుడు ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగులకూడదు. తెలిసి తెలిసి చేసే తప్పును ఆ భగవంతుడు క్షమించడు. అంతేకాదు మద్యపానం కూడా అంతే. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ గల ఉంగారాన్ని ధరించాలి. లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఏదైనా ప్రమాదం జరిగితే అయ్యో ఆయన ఎంతో మంచి వాడండి, భగవంతుడు ఇలాంటి వారికే ఎందుకు శిక్షిస్తాడు అని జాలిపడతాం. ఆయన మనసు మంచిది కావచ్చు. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తాయి. అందుకే భగవంతుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.