ధనుస్సు రాశి వారు గురుగ్రహ దోషాలు తొలగిపోవాలంటే.... ఏం చేయాలి?

శుక్రవారం, 29 జూన్ 2018 (14:52 IST)

దోష నివారణకు నవరత్నాల్లోని కనకపుష్యరాగాన్ని ధరించడం మంచి ఫలితాలనిస్తుందని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ పుష్యరాగాన్ని ధనుస్సురాశి జాతకులు ధరించాలి. ఈ రాశికి అధిపతి బృహస్పతి. కావున ధనుస్సురాశి జాతకులంతా దయాహృదయులుగా ఉంటారు. మృదువుగా సంభాషించడం, అధికారం చెలాయించడం వీరి నైజం.
 
ఈ రాశికి చెందిన జాతకులు కనకపుష్యరాగ రత్నాన్ని ధరించడం ద్వారా బలము, నేత్రజ్యోతి పెరుగుతుందని రత్నాలశాస్త్రం పేర్కొంటుంది. వ్యాపారము, వ్యవసాయములలో వృద్ధి చెందడంతో పాటు, చదువు, అభ్యాసముల్లో ప్రగతి చెందుతారు. 
 
పుష్యరాగాన్ని ఎలా కనుగొనాలంటే?
కనకపుష్యరాగంపై ఎటువంటి చారలు ఉండవు. చూసేందుకు పారదర్శకంగానూ, కాంతివంతంగానూ ఉంటుంది. పుష్యరాగాన్ని చేతిలో తీసుకుంటే బరువుగా ఉంటుంది. అసలైన పుష్యరాగాన్ని ఎండలో ఉంచితే వెలుగు వ్యాపిస్తుంది.
 
ఎలా ధరించాలంటే?
కుడిచేతి చూపుడు వ్రేలుకు ధరించాలి. గురువారం సూర్యోదయ సమయంలో ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. బంగారంతో పుష్యరాగాన్ని ఇమిడ్చి ధరించడం మంచిది. ముందుగా పాలలో గానీ, గంగాజలములో గానీ శుద్ధిచేయాలి. పుష్యరాగాన్ని ధరించే ముందు 160 సార్లు గురుధ్యాన శ్లోకములు ధ్యానించడం మంచిది.దీనిపై మరింత చదవండి :  
గురుగ్రహ దోషాలు ధనస్సు రాశి భవిష్యత్వాణి చదువు బలము ఆధ్యాత్మికం శ్లోకాలు Power Jupiter Bugs Turning Sagittarius Religion Astrology Future Benefits Education

Loading comments ...

భవిష్యవాణి

news

ఎనిమిది దిక్కుల్లో దీపాలు వెలిగిస్తే? దక్షిణ దిశలో మాత్రం వద్దే వద్దు.. ఎందుకు?

దిక్కులు ఎనిమిది. ఈ ఎనిమిది దిక్కుల్లో దీపమెలిగిస్తే ఎలాంటి ఫలితాలను పొందవచ్చో చూద్దాం.. ...

news

శుక్రవారం (29-06-2018) దినఫలాలు - అపరిచిత వ్యక్తుల పట్ల...

మేషం: ఆర్థిక, వ్యాపార విషయాలను గోప్యంగా ఉంచండి. ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ...

news

వీధులు ఇంటి ప్లాటు కంటే ఎత్తులో ఉండొచ్చా?

సాధారణంగా గృహాలను నిర్మించుకునే సమయంలో వీధి ప్లాటును నిశితంగా పరిశీలిస్తారు. అలాగే ...

news

28-06-2018 - గురువారం మీ రాశి ఫలితాలు.. మిమ్మల్ని పొగిడే వారే కానీ..?

మేషం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. నిరుద్యోగయత్నాలు కలిసిరాగలవు. తరుచు దైవ, సేవా ...