బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By selvi
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:13 IST)

నవరత్న శాస్త్రం.. సింహరాశి జాతకులు మాణిక్యాన్ని ధరిస్తే...?

మేషరాశిలో జన్మించిన జాతకులు నవరత్నాల్లో పగడాన్ని ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. మేష రాశికి కుజుడు అధిపతి కావడంతో పగడాన్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. అలాగే వృషభ రాశి జాతకులకు శుక్రుడు అధిపతి కావ

మేషరాశిలో జన్మించిన జాతకులు నవరత్నాల్లో పగడాన్ని ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. మేష రాశికి కుజుడు అధిపతి కావడంతో పగడాన్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. అలాగే వృషభ రాశి జాతకులకు శుక్రుడు అధిపతి కావడంతో పూర్తిగా తెలుపు లేకుండా లేత గోధుమ రంగులోని ముత్యాలను, లేదా వజ్రాన్ని గానీ ధరించడం ద్వారా ఈతిబాధలుండవు. 
 
ఇక మిథున రాశి, కన్యా రాశి జాతకులకు అధిపతి బుధుడు కావడంతో.. పచ్చను ధరిస్తే మేలు జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి జాతకులకు చంద్రుడు అధిపతి కావడంతో మంచి ముత్యాలను ధరించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. 
 
ఇకపోతే.. సింహరాశికి అధిపతి సూర్యుడు కావడంతో మాణిక్యాన్ని ధరించడం ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. అలాగే ధనుర్‌రాశి, మీనరాశి జాతకులు పుష్యరాగాన్ని ధరించడం శుభఫలితాలను ఇస్తుంది. ఈ రాశులకు గురువు అధిపతి. మకర, కుంభ రాశులకు శనీశ్వరుడు అధిపతి కావడంతో నీలాన్ని ధరించడం వలన శుభాలను పొందగలరని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.