శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (15:08 IST)

పాలిష్ చేస్తే షూస్ మెరుస్తాయెందుకు?

పాలిష్ చేసిన తర్వాత వేసుకునే షూకి, పాలిష్ చెయ్యని షూకి ఉన్న తేడా విద్యార్థులకు చాలా స్పష్టంగా తెలుసు. అయితే, షూకి పాలిష్‌తో వచ్చే మెరుపు ఆ షూ నునుపుదనంపై ఆధారపడివుంటుంది. షూ తయారీకి వాడేది చర్మం అయినా.. ఇతర పదార్థమైనా దాని నిండా చిన్నచిన్న గుంటలు ఉండి గరుకుగా ఉంటుంది. 
 
అందువల్ల షూ డల్‌గా ఉంటుంది. పాలిష్ చేసినపుడు మనం వాడే పాలిష్ పదార్థం ఆ గుంటలను నింపటం వల్ల చర్మం నునుపుగా తయారై వెలుతురు పడినపుడు మెరుస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.