చరిత్రలో ఈ రోజు (జూన్22)
సంఘటనలు:
1897: 'రాండ్', 'ఆయెర్ స్ట్' అనే ఇద్దరు బ్రిటిష్ వలస పాలన అధికార్లను మహారాష్ట్రలోని పూనాలో 'ఛాపేకర్ సోదరులు (దామొదర్ హరి, వాసుదేవ హరి, బాలకృష్ణ హరి) ', ' మహాదెవ్ వినాయక్ రనడే ' లు చంపేసారు. 'ఛాపేకర్ సోదరులు', 'రనడే' దొరికిన తరువాత, బ్రిటిష్ వారు వారిని ఉరి తీసారు. 'ఖండొ విష్ణు సాథె' అనే పాఠశాల విద్యార్థిని, కుట్రకు సహకరింఛాడని 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి అమరవీరులుగా వారిని పేర్కొంటారు. '1897 జూన్ 22' అనే మరాఠీ సినిమా ఈ సంఘటనే ఆధారం.