శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By IVR
Last Modified: శుక్రవారం, 25 జులై 2014 (17:17 IST)

ఆ కప్ప 7 నెలలు ఐసుగడ్డలా చచ్చినట్లు ఉంటుంది... మళ్లీ

ఆ కప్ప ఐసుగడ్డలా మారుతుంది. కానీ చచ్చపోదు. అలాగని కదలదు మెదలదు. సుమారు ఏడు నెలలపాటు ఇదే స్థితిలో ఉంటుంది. దాని శరీరంలోని ముప్పావు వంతు భాగం ఐసుగడ్డలా మారిపోతుంది. ఆ సమయంలో దాని కాళ్లు పట్టుకుంటే మనం చూసే మామూలు కప్పల కాళ్లలా అటుఇటూ కదలవు. జంతికలా పుటుక్కున విరిగిపోతాయి. 
 
ఎందుకంటే అందులో ఉన్నది ఐసు కదా. ఇదంతా ఎక్కడనుకుంటున్నారు. అలస్కాలో. సెప్టెంబరు నెల వస్తుందంటే అక్కడి కప్పలు ఇలా మారిపోతాయి. అంతేకాదు కప్ప ఇలాంటి స్థితికి వెళ్లినప్పుడు దాని గుండె స్పందనలు ఆగిపోతాయట. రక్తం సరఫరా దాదాపు ఆగిపోయినట్లుగా మారుతుందట. చెప్పాలంటే దాదాపు అది చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది. 
 
ఐతే విచిత్రమేమంటే, గండెతో సంబంధం లేకుండా శరీరంలో ఉండే ఇతర నాడి వ్యవస్థలు మాత్రం తమ పని తాము చేస్తూనే ఉంటాయి. మొత్తంగా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శరీరం మంచుగడ్డలా మారిపోయిన స్థితిలో ఈ కప్ప 7 నెలలపాటు ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత తిరిగి క్రమంగా మామూలు దశకు చేరుకుంటుంది. అదీ అలస్కా కప్ప గురించిన సంగతి.