గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 3 నవంబరు 2014 (15:07 IST)

వెల్లుల్లిలో యాంటీ ఒబిసిటీ లక్షణాలున్నాయట!

వెల్లుల్లిలో యాంటీ ఒబిసిటీ లక్షణాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత వెల్లుల్లిని వారానికి మూడుసార్లైనా ఆహారంలో చేర్చుకోవాలని  వారు సూచిస్తున్నారు. 

కార్డియో వాస్కులార్ సిస్టమ్‌కు వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. ఇది సిస్టోలిక్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. అదే విధంగా ట్రై గ్లిజరైడ్స్ కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. 
 
వెల్లుల్లిలోని యాంటీ- ఒబిసిటీ లక్షణాలు ప్రతి క్షణం శరీరంలో కణాలు నశింపజేస్తాయి. అలాగే శరీరం కొత్తకణాలను తయారుచేస్తుంటుంది. వీటి ప్రక్రియను క్రమంగానిర్వర్తించడానికి వెల్లుల్లి అద్భుతంగా సహాయపడుతుంది. 
 
కాబట్టి, రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి చేర్చుకోండి. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలని కోరుకొనే వారు పచ్చివెల్లుల్లి మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.