1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (15:04 IST)

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా.. స్ట్రాబెర్రీస్, ద్రాక్షలు తీసుకోండి!

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా.. స్ట్రాబెర్రీస్, ద్రాక్షలు తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కిడ్నీలో రాళ్లు చేరకుండా.. ఆరోగ్యంగా ఉండాలంటే స్ట్రాబెర్రీస్‌, ద్రాక్షలతో పాటు శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ముఖ్యంగా కిడ్నీ ఆరోగ్యం కోసం క్యాబేజ్ తీసుకోవాలి. క్యాబేజ్‌లో పొటాషియం, విటమిన్ కె అధికంగా ఉంటుంది. క్యాబేజ్ మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణంగా క్యాబేజ్‌ను మూత్రపిండాల డ్యామేజ్‌ను అరికట్టడానికి, మూత్రపిండాల పోషణకు ఒక మంచి సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.
 
అలాగే రంగు రంగుల బెర్రీలు కిడ్నీలకు చాలా మంచిది. స్ట్రాబెర్రీ, రస్ బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్ బెర్రీ ఏదైనా సరే మంచివే. యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉండే బెర్రీలు కిడ్రీ ఆరోగ్యానికి మాత్రమే కాదు కేన్సర్ కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, రాస్బెరీస్, బ్లూబెర్రీస్ అన్నింటిలోనూ కిడ్నీ ఫ్రెండ్లీ న్యూట్రీషియన్స్, యాంటీఇన్ ఫ్లమేటరి గుణాలు పుష్కలంగా ఉండి, వ్యాధి నిరోధకతను కలిగించి బ్లాడర్ ఫంక్షన్స్ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతాయి.
 
ఇకపోతే.. రెడ్ గ్రేప్స్ కిడ్నీ హెల్తీ ఫుడ్. అందువల్లే దీన్ని డైలీ డై‌ట్‌లో ఖచ్చింతగా చేర్చుకోవడం మంచిది. రెడ్ గ్రేప్స్‌లో అధికంగా ఫ్లవనాయిడ్స్ కలిగి వుంటాయి. రెడ్ గ్రేప్స్ తరచూ తీసుకోవడం వల్ల గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులను తగ్గించే అవకాశాలు ఎక్కువ. రెడ్ గ్రేప్ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, క్లీన్ చేయడానికి బాగా సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.