మంగళవారం, 28 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 3 నవంబరు 2014 (18:10 IST)

బ్రేక్ ఫాస్ట్‌గా శాండ్‌విచ్‌ను తీసుకుంటున్నారా?

బ్రేక్ ఫాస్ట్‌కు శాండ్‌విచ్.. బేకరీ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు కొన్ని తృణధాన్యాలలో పిండి పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. వాటిని అల్పాహారంగా తీసుకుంటే, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలో సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే అల్పాహారంగా బేకరీ వస్తువులను నివారించటం ఉత్తమం. దానికి బదులుగా అధిక ఫైబర్ మరియు ప్రోటీన్ ఉన్న తృణధాన్యాలను ఎంచుకోండి. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా కావాలంటే అవిసె లేదా అక్రోట్లను జోడించండి.
 
అలాగే సమతుల్య బ్రేక్ ఫాస్ట్ అనేది గుడ్డు, మాంసం, జున్ను, టోస్ట్‌తో తయారయి ఉండవచ్చు. కానీ నిజంగా నూనెలో వేగించిన గుడ్డును, ప్రాసెస్ చేసిన పంది మాంసం, పూర్తిగా కొవ్వు చీజ్‌‌లను బ్రేక్ ఫాస్ట్ శాండ్విచ్‌లో ఉపయోగిస్తే విచ్ఛిన్నం అవుతుంది.
 
దానికి బదులుగా గుడ్డు మరియు తక్కువ కొవ్వు చీజ్ ఉపయోగించాలి. అలాగే కూరగాయలు, ఆకుకూరలతో హోం మేడ్ శాండ్‌విచ్‌ను బ్రేక్ ఫాస్ట్‌గా ఎంచుకోవచ్చు.