శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (17:10 IST)

చపాతీలు తినండి.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండి!

చపాతీలు తినండి.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. చపాతీలో జింక్, ఫైబర్, ఇతర మినిరల్స్ అధికంగా ఉండటంవల్ల ఇది చర్మానికి చాలామేలు చేస్తుంది. చర్మాన్ని హైడ్రేషన్లో ఉంచుతుంది. అలాగే చపాతీల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తంలో హీమోగ్లోబిన్ లెవల్స్‌ను ఇది పెంచుతుంది. రోటీల్లో ఉండే ఫైబర్ కంటెంట్, సెలీనియం కంటెంట్ కొన్ని రకాల క్యాన్సర్లు నివారిస్తుంది. క్యాన్సర్ బారీన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
 
చపాతీలకు నూనె లేదా బటర్ జోడించకుండా తీసుకుంటే చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. ఇది వెయిట్ లాస్ డైట్‌కు గ్రేట్‌గా సహాయపడుతుంది. గోధుమలు, గోధుమ పిండితో తయారుచేసే రోటీలు వల్ల శరీరానికి విటమిన్స్, మినిరల్స్ అంటే మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.