శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (17:07 IST)

మొక్కజొన్నలోని హెల్త్ బెనిఫిట్స్: చర్మ సంరక్షణకు కూడా...?

మొక్కజొన్నలో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ దాగివున్నాయి. ఇందులో లవణాలు, మినరల్స్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. తద్వారా ఒబిసిటీని దూరం చేస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.  
 
మొక్కజొన్న గింజలలో మినరల్స్‌ అధికం. మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌ వంటివి కూడా వీటిలో వుండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. మొక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. నిత్యయవ్వనులుగా ఉంచుతాయి. 
 
రక్తహీనతకు చెక్  పెడుతుంది. స్వీట్‌ మొక్కజొన్న విటమిన్‌ ప్లస్ ఫోలిక్‌ యాసిడ్‌లు కలిగివుండటంతో రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే పెద్ద పేగు క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. కిడ్నీ, హృద్రోగ సమస్యల నుంచి మొక్కజొన్న రక్షిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని నివారించడానికి సహాయపడుతుంది. 
 
ప్రతి రోజూ తగు పరిమాణంలో కార్న్ తినడం వల్ల హెయిర్ ఫోలీ సెల్స్‌కు బలాన్ని చేకూరుస్తుంది. ఇందులోని విటమిన్ సి.. జుట్టును మృదువుగా.. షైనింగ్‌గా ఉండేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.