మంగళవారం, 28 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2014 (15:55 IST)

భోజనంలో సగభాగం కూరగాయలు ఉండాల్సిందే!

భోజనంలో సగభాగం కూరగాయలు ఉండాల్సిందే.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనాన్ని నాలుగు భాగాలుగా విభజించటం ఉత్తమం. తీసుకునే భోజనంలో కూరగాయులు ఉండాలి.
 
పావు భాగంలో పిండి ఉత్పత్తులు.. ఇంకొక పావు భాగంలో మాంసం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఫిట్‌గా ఉంటారు. అలాగే కూల్‌డ్రింక్స్, ప్యాక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి.
 
మంచి ఆరోగ్యం కొరకు రోజుకు 2-3 లీటర్స్ నీటిని త్రాగాలి. నీరు తాగడం ద్వారా శరీరానికి ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచటానికి, శరీరంలో వ్యర్థాల వృద్ధిని నిరోధించడానికి సహాయపడుతుంది.
 
సమర్థవంతమైన ఆరోగ్యకరమైన బరువు నష్టం కోసం హోల్ మిల్క్ నుండి మీగడ తీసిన పాలకు మారటం ఉత్తమం. హోల్ మిల్క్ బరువును పెంచుతుంది. 
 
అలాగే సహజ కేలరీలు కలిగి ఉంటుంది. కానీ మీగడ తీసిన పాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే బరువు నష్టం కోసం ఒక ఆరోగ్యకరమైన ఎంపికను చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.