శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (15:15 IST)

డైట్ లిస్టులో ఆకుకూరలు, పండ్లరసాలు ఉన్నాయా?

ఆకుకూరలు వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా కోలన్ (పెద్ద ప్రేగును) శుభ్రం చేయడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఆకుకూరలు జీర్ణ కోశాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అలాగే ఏదేని పండ్లరసం రోజువారీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. 
 
పండ్ల రసంలోని ఫైబర్, ఎంజైమ్లు పెద్దప్రేగును శుభ్రం చేసే లవణాలు ఇవి డిటాక్సిఫై చేయడానికి, పెద్దప్రేగులోని మలినాలను బయటికి పంపించేస్తుంది. వెల్లుల్లిని కూడా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పెద్దపేగును శుభ్రం చేసుకోవచ్చు.
 
ఇంకా వారానికి రెండుసార్లు చేపలు తీసుకోవాలి. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, డైజెస్టివ్ ట్రాక్‌ను శుభ్రం చేసే ఆయిల్స్ పెద్దప్రేగును శుభ్రం చేయడానికి సహాపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 
అవొకాడోలో కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికం. ఇవి కోలన్‌ను శుభ్రం చేస్తుంది. జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది. ఓమేగా 3 ఫ్యాటీ ఆయిల్స్ పెద్ద ప్రేగు గోడకు ఒక లూబ్రికెంట్ వలే పనిచేస్తుంది. అన్ని ఆహారపు అణువులను, వ్యర్థాలను బయటికి నెట్టేస్తుంది.