శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 మే 2015 (16:20 IST)

బరువు తగ్గాలనుకుంటే.. రేగిపండ్ల జ్యూస్ తాగండి.

రేగిపండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రేగిపండ్లను జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అలాగే తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రేగిపండ్లను రోజుకు 3-6 తినడం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. ఈ పండ్ల జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో గుండెపోటు, హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే బరువు తగ్గాలనుకుంటే.. రేగిపండ్ల జ్యూస్ తాగండి. ఫ్రూనే జ్యూస్‌లో ఉండే సోలబుల్ ఫైబర్ ఆకలి అనిపించకుండా వేరే ఇతర ఆహారాల జోలికి పోకుండా చేస్తుంది. అనీమియాతో బాధపడుతున్నట్లైతే, రేగిపండ్ల జ్యూస్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే పొటాషియం ఉంది.  రోజూ రెగ్యులర్‌గా వంద గ్రాములు తీసుకుంటే మహిళల్లో మోనోపాజ్ దశలొ ఓస్టిరియో ఫోసిస్ తగ్గిస్తుంది.
 
రేగిపండ్ల జ్యూస్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి అధికం. కాబట్టి ఒక గ్లాసు రేగి పండ్ల జ్యూస్ త్రాగడం వల్ల, ఇది చర్మానికి మాత్రమే కాదు. శరీరానికి కూడా చాలా గ్రేట్‌గా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.