శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2014 (17:23 IST)

నిద్రలేమికి చెక్ పెట్టే ఐదు ఫుడ్స్ ఏవి..?

నిద్రలేమి సమస్య ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఫాస్ట్ యుగంలో అందరినీ వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. దీని నుంచి ఉపశమనం లభించాలంటే ఆహారంలో మార్పులు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  
 
నిద్రకు ఉపక్రమించే ముందు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు ఇష్టమైన దైవ శ్లోకాన్ని పఠించడం మంచిది. లేకుంటే ఒకటి నుంచి వంద వరకు సంఖ్యలు ఎంచుకుంటేనూ నిద్ర వచ్చేస్తుంది. ఒకవేళ 1 నుంచి 1000 వరకు ఎంచినా నిద్ర రావట్లేదంటే తప్పకుండా ఆహారంలో మార్పులు చేయాల్సిందే. 
 
అవేంటో చూద్దాం.. 
* చెర్రీ ఫ్రూట్స్ నిద్రను రప్పించే ధాతువులను కలిగివుంటాయి. నిద్రకు ఉపక్రమించేందుకు గంట ముందు ఈ ఫ్రూట్స్ రెండేసి తీసుకోవాలి.  
 
* అరటిపండు.. ఇందులోని పొటాషియం, మాగ్నీషియం కలిగివుండటం ద్వారా నిద్రలేమిని దూరం చేస్తుంది. 
 
* టోస్ట్.. బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకునే టోస్ట్‌లను నిద్రపోయేందుకు ఒక గంట ముందు తీసుకోవడం ద్వారా ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
* ఓట్స్ మీల్‌ను వేడిగా ఒక గ్లాసు తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు మంచి నిద్రకు కారణమవుతుంది. 
 
* ఇక ఒక గ్లాసు వేడి పాలను రాత్రి పూట తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు.