1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 జులై 2014 (16:31 IST)

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి!

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి అంటున్నారు న్యూట్రీషన్లు. ఆకలితో పస్తులున్నప్పుడు ఫ్రిజ్‌లో ఏమి లేనప్పుడు, అలమారాలు ఖాళీగా ఉన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఆహారాల మీద ప్రలోభపడటం జరుగుతుంది. మీరు ముందుగానే భోజనం ప్లాన్ చేసుకుంటే వంట నియంత్రణ మరింతగా ఉంటుంది. 
 
అప్పుడు ఆహారం లేదా డబ్బు వృధా కాదు. సూపర్ మార్కెట్‌కు వెళ్ళే ముందు జాబితాను తయారుచేసుకోవటం అనేది ఒక గొప్ప ఆలోచన. దీని వలన తప్పుడు ఆఫర్లకు ప్రలోభపడటం జరగదు.
 
బరువు కోల్పోవాలనుకుంటే జీవన విధానంలో మార్పులు చేసుకోండి. అలాగే చురుకుగా ... ఒక అడుగు ముందుకు వేయండి మీరు ఒక ఖరీదైన జిమ్‌లో సభ్యత్వం కోసం సైన్ అప్ అవవలసిన అవసరం లేదు. నడక, వ్యాయామం అలవాటు చేసుకోండి అంటున్నారు.