శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (18:40 IST)

జంక్ ఫుడ్ తిన్నారో.. మెమరీ పవర్ గోవిందా..!

స్పీడ్ యుగం పుణ్యమా అంటూ.. ప్రస్తుతం జంక్ ఫుడ్‌కు యమా క్రేజ్. బిజీ లైఫ్ ప్లస్ లభించే కొద్దిపాటి సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ తినడంపైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే జంక్ ఫుడ్ అనారోగ్యాలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ, తాజా అధ్యయనంలో జంక్ ఫుడ్‌తో మెమరీ లాస్ సమస్య తప్పదని తేలింది. 
 
తాజాగా, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జంక్ ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం ద్వారా వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి దెబ్బతింటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ బీట్రిస్ గొలోంబ్ తెలిపారు. జంక్ ఫుడ్‌ను అధికంగా తినే సుమారు 1000 మంది ఆరోగ్యవంతులపై ఈ మేరకు పరిశోధన నిర్వహించారు. 
 
కొన్ని పదాలతో వారి జ్ఞాపకశక్తికి పరీక్ష పెడితే అధ్వాన్నమైన ఫలితాలు వచ్చాయట. దీనిపై గొలోంబ్ వివరిస్తూ, జంక్ ఫుడ్‌లో ఉండే ప్రో ఆక్సిడెంట్లు కణశక్తికి వ్యతిరేకంగా పనిచేస్తాయని తెలిపారు. తద్వారా దేహ ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, మెదడు పనితీరు మందగిస్తుందని అన్నారు. క్రమేణా జ్ఞాపకశక్తి తరిగిపోతుందని పేర్కొన్నారు.