కాలేయంలో కొవ్వు పేరుకుపోతే ప్రాణాలకే ముప్పు తెస్తుంది, ఎందుకంటే?
క్రమబద్ధమైన జీవనశైలి లేకపోవడం వల్ల పలు వ్యాధులు చుట్టుముడతాయి. ఆహారపు అలవాట్లు, నిద్ర అలవాట్లు, ధూమపానం, మద్యపానం, ఇతర జీవనశైలి తప్పుల వల్ల సంభవించేవే ఆరోగ్య సమస్యలు. ఇందులో మన శరీరంలోని ముఖ్యమైన అవయవం కాలేయం గురించి చూద్దాం. పేలవమైన జీవనశైలి కారణంగా, ఫాటర్ లివర్ డిసీజ్ సమస్య సర్వసాధారణంగా మారుతోంది. ఈ సమస్యతో బాధపడే రోగుల సంఖ్య భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది.
ఆరోగ్యకరమైన కాలేయం కోసం విటమిన్ B12, ఫోలేట్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫ్యాటీ లివర్ వ్యాధిలో, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, అది తీవ్రమైన కాలేయ గాయాలకు కారణమవుతుంది. అంతేకాదు క్రమంగా కాలేయం పరిమాణం కూడా పెరుగుతుంది.
కాలేయంలో సింటాక్సిన్ 17 అని పిలువబడే ప్రోటీన్ అవసరం. ఇది కాలేయంలో నిల్వ చేయబడిన కొవ్వు విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియలో అలాగే జీవక్రియలో సహాయపడుతుంది. ఈ ప్రొటీన్ లోపం వల్ల కాలేయంలోని దెబ్బతిన్న కణాలను శుభ్రం చేయడం కష్టమవుతుంది. విటమిన్ B12 మరియు ఫోలేట్ ఈ ప్రోటీన్ మొత్తాన్ని పెంచుతాయి, ఇది కాలేయ వాపు, గాయాలను తగ్గిస్తుంది. అందుకే లివర్ ఇన్‌ఫ్లమేషన్ ఉన్నవారికి ఫోలేట్ అలాగే విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. విటమిన్ B12 యొక్క మూలాలు ఏమిటంటే... చేపలు, పీతలు, ఇతర రకాల సీఫుడ్, సోయా పాలు, తక్కువ కొవ్వు పాలు, చీజ్, గుడ్లు, ఫోలేట్ ఆహార వనరులు, బీన్స్ మరియు పప్పులు, ఆకుపచ్చ ఆకు కూరలు, కాలీఫ్లవర్, బ్రోకలీ, పాలు, చేపలు.