గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 30 మే 2022 (22:54 IST)

డయాబెటిక్ వ్యాధి వున్నవారు మామిడిని తినవచ్చా?

Mango
మధుమేహం వున్నవారు మామిడికాయలు తినరాదని అంటారు. ఐతే మధుమేహంతో బాధపడుతూ మామిడిపండు తినాలనిపిస్తే.. పగటిపూట తినడం మంచిదని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి. ఎందుకంటే... పగటిపూట శరీరం యొక్క జీవక్రియ రేటు బాగానే ఉంటుంది.


అదే సమయంలో, మామిడిలో ఉండే చక్కెరలో 30 శాతం ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుందని అధ్యయనం పేర్కొంది. కాలేయంలో... మామిడి పండు చక్కెర యొక్క జీవక్రియ శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ మొత్తాన్ని పెంచుతుంది. కాబట్టి మధుమేహం వున్నవారు మామిడి తీసుకోవడం సమస్యగా ఉంటుంది.

 
మామిడి పండ్లలో చాలా కేలరీలు చక్కెర నుండి వస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు, మామిడిపండ్లు తినాలనుకుంటే ముందుగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.