సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (09:46 IST)

గ్రీన్ టీ అధికంగా తాగితే..?

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీలోని ప్రోటీన్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. తరచు గ్రీన్ టీ తాగడం వలన అధిక బరువు కూడా తగ్గుతారు. గ్రీన్ టీని నిత్యం తాగడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. గ్రీన్ టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అదేవిధంగా టీని అధికంగా తాగితే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు. 
 
అదేపనిగా గ్రీన్ టీ అధికంగా తాగడం వలన హైబీపీ వస్తుంది. రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా గుండె కొట్టుకుని వేగం పెరుగుతుంది. ఈ టీ ఎక్కువగా తాగడం వలన ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం ఎక్కువగా శోషించుకోలేదు. అలానే శరీరంలో హార్మోన్ల పనితీరులో సమతుల్యత దెబ్బ తింటుంది. హార్మోన్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. 
 
నిద్రలేమితో బాధపడేవారు మాత్రం గ్రీన్ ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే.. గ్రీన్ టీని అధికంగా తాగితే నిద్రలేమి సమస్య ఎక్కువైయ్యే అవకాశాలు అధిక మోతాదులో ఉన్నట్టు ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. కనుక గ్రీన్ టీని నిత్యం 2 లేదా 3 కప్పులను మించకుండా తాగాలి. టీని అధికంగా తాగడం వలన జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయి అసిడిటీ వ్యాధికి దారి తీస్తాయి. దాంతో జీర్ణక్రియ మందగిస్తుంది. కనుక వీలైనంత వరకు గ్రీన్ టీని తాగడం తగ్గించుకుంటే.. ఫలితం ఉంటుంది.