Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోళ్లు పెంచుకుంటే ఎంతటి సమస్యలు వస్తాయో తెలుసా..?

శనివారం, 6 జనవరి 2018 (19:55 IST)

Widgets Magazine
nails

గోళ్ళు కొంతమంది అలా పెరిగి పెరగగానే వెంటనే కట్ చేసేస్తారు. కానీ కొంతమంది మాత్రం అదేదో శరీరానికే అందం పెంచేటట్లు చుట్టూ ఉన్న ప్రపంచం తమ గోళ్ళవైపే ఉన్నట్లు తెగ పెంచేస్తూ ఉంటారు. అయితే ఇలా గోళ్ళు పెంచడం వల్ల లాభం లేకపోగా నష్టాలు చాలానే ఉన్నాయని ఎక్కువమందికి తెలియని విషయం. అసలు గోళ్ళను పెంచడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం.
 
చాలామంది ఒత్తిడి ఎక్కువగా ఉంటే గోళ్ళను ఎడాపెడా కొరికేస్తూ ఉంటారు. ఇటువంటి వారికి ఎంత చెప్పినా అలవాటు మార్చుకోరు. గోళ్ళు కత్తిరించడం మాత్రమే ఉత్తమమైన మార్గం. అలా కాకుండా గోళ్ళను కొరికితే గోళ్ళలోని క్రిములన్నీ సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా బాగా పెరిగిన గోళ్ళు ఉండటం వల్ల స్నానం చేసే సమయంలో శరీరాన్ని రుద్దుతున్నప్పుడు శరీరాన్ని గాయం చేసే ప్రమాదం ఉంటుంది. అప్పటికే గోళ్ళలో నివాసముంటున్న రకరకాల క్రిములకు శరీరంలోకి ఈజీగా వెళ్ళిపోతాయి. భోజనానికి ముందు ఎంత శుభ్రంగా చేతులు కడిగినా గోళ్ళలో మురికి అలాగే ఉంటుంది. మరీ ముఖ్యంగా గోళ్ళకు ఏదైనా తగిలితే విపరీతమైన నొప్పి కలుగుతుంది.
 
ఒకవేళ పొరపాటున విరిగితే ఆ నొప్పి వర్ణించలేనిది. గోళ్ళను పెంచుకోకపోవడం మంచిది. గోళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేయకూడదు. మంగళవారం గోళ్ళు కట్ చేయకూడదు. శుక్రవారం మహాలక్ష్మి కాబట్టి ఆ రోజు కూడా కట్ చేయకపోవడం చాలా మంచిది. కటింగ్ చేసుకున్నప్పుడే గోళ్ళు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్నానానికి ముందే గోళ్ళను తొలగించాలి. ఇంటి బయటే గోళ్ళను తీయాలి. మంగళ, శుక్రవారం తప్ప ఇంకెప్పుడైనా గోళ్ళు తీసుకోవచ్చు. అలాగని రాత్రి వేళల్లో గోళ్లు తీయడం చేయకూడదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

థాయ్‌లాండ్ మగాళ్లకు ఆ పిచ్చి... అంగానికి వైటనింగ్ సర్జరీ... ఎందుకంటే?

థాయ్‌లాండ్ మగాళ్లలో కొందరు ఇటీవలి కాలంలో ఓ సర్జరీ కోసం ఎగబడుతున్నట్లు తేలింది. తమ ...

news

వంకాయతో మధుమేహానికి చెక్

వంకాయలో పోషకాలు అధికం. వంకాయలోని పోషకాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. వీటిలోని బి-కాంప్లెక్స్ ...

news

చపాతీలు తింటే క్యాన్సర్ మటాష్

రోజూ రెండు చపాతీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ ...

news

ఆ ఒక్క చెట్టు మీ ఇంట్లో ఉంటే డాక్టర్ వద్దకెళ్ళాల్సిన అవసరం లేదు..

పండ్లలో నిమ్మపండుకు ఎప్పుడూ జీవం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మంగళప్రదానికి ...

Widgets Magazine