Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైఫైతో ఆరోగ్యానికి హాని... నిజమే.. తస్మాత్ జాగ్రత్త

గురువారం, 21 డిశెంబరు 2017 (21:51 IST)

Widgets Magazine
Wifi

ఈ రోజుల్లో నగరాల్లో వైఫై లేని ఇళ్ళు, ఆఫీసులు ఊహించడమే కష్టం. ఇళ్ళు, కార్యాలయం, విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, క్యాబుల్లో ఇలా ఇందుగలదు.. అందు లేదన్న సందేహం వలదన్నట్లు అన్నిచోట్ల వైఫై కూడా సర్వాంతర్యామిలా విస్తరిస్తోంది. కనీస అవసరాల గురించి చెప్పాలంటే ఇప్పటివరకు తిండి, గుడ్డ, నీళ్ళు అని చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అని చెప్పక తప్పదు. 
 
ఆర్‌ఎఫ్‌ ఎక్స్‌పోజర్ గురించి ఎలుకల పైన నిర్వహించిన అధ్యయనంలో మూత్ర పిండాల అభివృద్థికి జాప్యం ఏర్పడినట్లు తెలిసింది. వైఫై ఆన్‌లో ఉండగా, లేకుంటే సెల్‌ ఫోన్ సమీపంలో ఉంచుకుని పడుకొని ఉండడం వల్ల దీర్ఘ కాల నిద్ర సమస్యలు సంభవిస్తాయి. వైఫై నుంచి నిరంతరంగా వచ్చే తరంగాలతో నిద్ర సమస్య ఏర్పడుతుంది. 2014లో ప్రచురితమైన ఒక చైనీస్ పరిశోధనలో మూడు నిమిషాల ఆర్‌ఎఫ్‌ రేడియేషన్ వల్ల మెదడులోని కొన్ని స్థానాల్లో అత్యంత ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గులు ఏర్పడుతాయని తేలింది.
 
ల్యాప్‌టాప్‌ల వల్ల వచ్చే వేడి వీర్యకణాలకు హాని చేస్తుందని పరిశోధనలో తేలింది. 2012లో అర్జెంటీనాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వైఫై కారణంగా వీర్య చలనస్థితి తగ్గి డిఎన్ఎలో వైరుధ్యాలు సంభవిస్తాయని తేలింది. ఆ అధ్యయనంలో వీర్యం నమూనాలను నాలుగు గంటల పాటు వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయినా ల్యాప్ టాప్‌కు సమీపంలో ఉంచారు. ఈ రేడియేషన్‌ల వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అన్న విషయంపై ఇప్పటికే సీరియస్‌గా పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రీయ సమీక్షా కథనం ప్రకారం గర్భవతులకు చాలా హాని ఉంటుందని తేలింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రోజూ గ్లాసుడు బత్తాయి రసం తాగితే..

బత్తాయి రసంలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్నాయి. స్వీట్ లెమన్, మోసంబి అని పిలువబడే ఈ ...

news

శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే వాము

శీతాకాలంలో వాము వేసి మరిగించిన నీటిని సేవించడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా వుంటుంది. ఈ ...

news

మీరు రాత్రి సమయంలో పుట్టారా.. అయితే ఖచ్చితంగా ఇది చదవాల్సిందే..

ప్రపంచంలో పుట్టిన మనుషులందరిలోను బాగా తెలివైన వారు కొందరు ఉంటారు. అలాగే కొంచెం తెలివైన ...

news

పైనాపిల్ జ్యూస్‌తో ప్రయోజనాలు...

మంచి భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పండ్లు... ఇలా సక్రమంగా అన్నీ తీసుకుంటుంటే ఆరోగ్యంగా ...

Widgets Magazine