గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (16:35 IST)

చలికాలం వస్తే చాలు... ముద్దులు, కౌగలింతలు వంటివి చేస్తే కసురుకుంటుంది...

నా గర్ల్ ఫ్రెండ్ ఆస్త్మా ఉంది. ఆమె అందానికి ఈ సమస్య ఓ శాపమేమో అనిపిస్తుంది. పాపం ఎన్ని మందులు వాడినా అదుపులోకి రావడంలేదట. ముఖ్యంగా చల్లటి వాతావరణంలో తిరిగిందంటే ఇక వెంబడే రొప్పుతుంది. ఆ రొప్పుతో పాటుగా గొంతులో ఒక రకమైన అరుపులు కూడా వినిపిస్తాయి. 
 
ఆ సమయంలో ఆమెను సమీపించి ముద్దులు, కౌగలింతలు వంటివి చేస్తే కసురుకుంటుంది. నా పరిస్థితి తెలిసి కూడా ఇలా చేస్తావేమిటి అంటుంది. ఆమె పరిస్థితి చూస్తున్న నాకు ఓ డౌట్ వచ్చి నా స్నేహితుడిని అడిగాను. వాడు చెప్పిన దానిప్రకారం ఆస్త్మా ఉన్నవారు శృంగారానికి పనికిరారట. ఇది నిజమేనా... పెళ్లయ్యాక నా గర్ల్ ఫ్రెండ్ శృంగారానికి ఒప్పుకోదా...? 
 
ఆస్త్మా రోగులకు శృంగారం ఇబ్బందికరంగా ఉండదు. ఐతే కొంచెం ఆయాసం, ఉక్కిరిబిక్కిరి కావడం తరచూ జరుగుతుంటాయి. బ్రాంకియల్ ఆస్త్మా పేషెంట్ల విషయంలో మాత్రం శృంగారం కాస్త ఇబ్బందికరమే. అలాంటివారికి దుఃఖం కానీ సమస్యలు కానీ తోడైతే మరీ ఇబ్బందికరం. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు శృంగారానికి పూర్వం తగిన మందులు వాడిన తర్వాత పాల్గొనవచ్చు.