Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లయిన కొత్తలో భార్యను వేధించే ఆ సమస్య

సోమవారం, 10 జులై 2017 (17:53 IST)

Widgets Magazine

సాధారణంగా పెళ్లయిన కొత్తలో శృంగారంలో పాల్గొన్న యువతిలో ఆనందం కంటే నొప్పి, బాధ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పెళ్లయిన కొత్తలో పూర్తి స్థాయిలో శృంగారంలో పాల్గొనలేరు. ఈ సమస్యను వైద్య పరిభాషలో మూత్రనాళ ఇన్ఫెక్షన్‌గా పిలుస్తారు. ఇది స్త్రీలకే ఎక్కువగా వస్తుంది. సరైన సమయంలో గుర్తించి చికిత్స ఇవ్వకపోతే ఇది మూత్రాశయానికి, కిడ్నీలకు పాకే అవకాశం ఉంది. 
 
ఈ సమస్య లక్షణాలను ఒకసారి పరిశీలిస్తే... మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి రావడం,  కొన్నిసార్లు రక్తపు చారలు ఉండటం, బొడ్డు కింది పొత్తి కడుపు కింది భాగంలో నొప్పి, 100 నుంచి 104 డిగ్రీల వరకూ జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి వచ్చినట్టు ఉంటుంది. 
 
ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఈ-కొలి అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుందని వైద్యులు చెపుతున్నారు. భర్త భార్యతో సంభోగంలో పాల్గొన్న తర్వాత ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అపరిశుభ్రమైన వేళ్లు లేదా పురుషాంగం పెద్ద పేగు చివరి భాగమైన పాయువు లేదా మలం ద్వారంను తగిలి అక్కడి నుంచి యోనిలోకి ప్రవేశించవచ్చని వైద్యులు చెపుతున్నారు. 
 
సాధారణంగా ఈ-కొలి బ్యాక్టీరియా మూత్రద్వారంలోకి ప్రవేశించిన ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ లక్షణాలు బయటపడతాయి. మూత్రపరీక్ష, మూత్ర కల్చర్ ద్వారా మూత్రంలో పస్‌సెల్స్, బాక్టీరియా కన్పిస్తాయి. ఈ సమస్యతో బాధపడే వారు తక్షణం నిపుణులైన వైద్యుడుని సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నూనెతో వేయించిన రొయ్యల్ని అతిగా తినకండి.. కూరలే బెస్ట్..

రొయ్యలు రుచిగా వుంటాయని ఎక్కువ నూనెతో వేయించిన వేపుళ్లతో తినకుండా.. తక్కువ నూనె వాడి ...

news

సైకిల్ వాడకం .. ఉపయోగాలు...

ప్రస్తుత హైటెక్ జీవితంలో సైకిల్ తొక్కడం అనేది చాలా మంది నామూషిగా భావిస్తున్నారు. కానీ, ...

news

నాజూగ్గా కనిపించాలంటే రోజుకు అరగంట కాదు.. పది నిమిషాలైనా నడవండి..

నాజూగ్గా కనిపించాలంటే.. వారానికి ఓ గంట వ్యాయామం చేయాల్సిందే. లేకుంటే రోజుకో అరగంట ...

news

రాత్రిపూట.. ఫుల్‌గా లాగిస్తే.. ఒబిసిటీ తప్పదు..

ఉదయం, మధ్యాహ్నం తక్కువగా భోజనం తీసుకుని.. రాత్రిపూట ఫుల్‌గా లాగిస్తే ఇబ్బందులు ...

Widgets Magazine