నిఫా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో 7 గ్రామాలను ఐసోలేషన్లో పెట్టేసారు. నిఫా వైరస్ వైరస్ లక్షణాలు, అది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. నిఫా వైరస్ వల్ల జ్వరం, వాంతులు, విరోచనాలు, శ్వాస సమస్యలు, మెదడువాపు, లో బీపీ వస్తాయి. నిఫా వైరస్ ముదరడానికి 7 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. అప్పటికీ కనుగొనలేకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం వుంది.
నిఫా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
పందులు, గబ్బిలాలకు దూరంగా ఉండాలి. గాట్లు పెట్టినట్లున్న పచ్చి పండ్లను తినకూడదు, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. పూర్తిగా ఉడికిన మాంసమే తినాలి, బయటి మాంస పదార్థాలకు దూరంగా వుండాలి. వ్యాధి లక్షణాలు కనిపించినట్లు అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రందించాలి.