ఆస్తమా సమస్య వున్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ఆస్తమా సమస్య వున్నవారికి శీతాకాలంలో చల్లని గాలి మహా చెడ్డది. ఎందుకంటే ఇది శ్వాసనాళాల గొట్టాలను చికాకుపెడుతుంది. ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఆస్తమా ఉన్నట్లయితే, చల్లని శీతాకాలపు వాతావరణంలో వీలైనంత వరకు తిరగకుండా ఇంట్లోనే ఉండడం మంచిది.
అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ అమెరికన్ అకాడమీ నివేదికల ప్రకారం, విత్తనాలు, గోధుమలు, సోయా, వేరుశెనగలు, గుడ్లు, చేపలు, ఆవు పాలు చాలా వరకు అలెర్జీలను ప్రేరేపించేవిగా వుంటాయి. అందువలన ఈ ఆహారాలలో దేనికైనా అలెర్జీని కలిగి ఉంటే, ఖచ్చితంగా వాటిని తినడాన్ని మానుకోవాలి.
ఉబ్బసం చికిత్సకు ఉపయోగించే రెండు ప్రధాన రకాల మందులు ఉన్నాయి, వాటిలో ఒకటి
ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ వంటి దీర్ఘకాలిక నియంత్రణ మందులు. రెండోది ఉబ్బసం నియంత్రణలో ఉంచడానికి ఉపయోగించే అత్యంత ముఖ్యమైన మందులు, త్వరిత-ఉపశమన ఇన్హేలర్లు అల్బుటెరోల్ వంటి వేగంగా పనిచేసే మందులను వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.
ఉబ్బసం ఉన్న చాలామందికి వెచ్చని గాలి ఉపశమనం ఇస్తుంది. ఆవిరి స్నానం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలేకుండా చేసే శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఐతే, ఆస్తమా మరింత ఎక్కువగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.