బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 3 జనవరి 2024 (18:46 IST)

గ్యాస్ట్రిక్ సమస్య తగ్గాలంటే ఇవే చిట్కాలు

Acidity
అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటివి గ్యాస్ట్రిక్ సమస్యల యొక్క కొన్ని సాధారణ లక్షణాలు. అతిగా తినడం, ధూమపానం, మద్యపానం, నిద్ర రుగ్మతలు, జంక్ తినడం, ఒత్తిడి మొదలైన వాటితో సహా అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. దీనిని అధిగమించేందుకు మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. రెండు గ్లాసుల నీటిలో ఓ స్పూన్ జీలకర్ర వేసి గోరువెచ్చగా చేసుకుని ఉదయం బ్రష్ చేసాక పరగడుపున తాగాలి.
 
రోజూ రాత్రి పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి లేదంటే కనీసం నడవాలి. మజ్జిగ తాగాలి. వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలుకలు, కొబ్బరినీళ్లు తాగుతుండాలి. కొత్తిమీర ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉపయోగించాలి.
 
అల్లంలో ఉండే ప్రధాన భాగం జింజెరాల్ నీటిని తాగితే ప్రయోజనం వుంటుంది. ఒక టీస్పూన్ పుదీనా రసం లేదా పుదీనా టీ లేదా పుదీనా చట్నీ తీసుకోవడం వల్ల గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.