శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chj
Last Modified: సోమవారం, 29 మే 2017 (20:26 IST)

ఆస్తమా వస్తే ఇక శాశ్వతంగా వుండిపోతుందా...?

ఆస్తమా, సైనసైటిస్ ఈ రెండూ వేర్వేరు వ్యాధులైనప్పటికీ ఒకదానికొకటికి సంబంధం వుంది. దీర్ఘకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నప్పుడు అది ఆస్తమాగా మారే అవకాశం ఎక్కువ. అసలు ఆస్తమా రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే... 5 మైక్రాన్ల కన్నా తక్కువ వుండే కణాలు సైనస్

ఆస్తమా, సైనసైటిస్ ఈ రెండూ వేర్వేరు వ్యాధులైనప్పటికీ ఒకదానికొకటికి సంబంధం వుంది. దీర్ఘకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నప్పుడు అది ఆస్తమాగా మారే అవకాశం ఎక్కువ. అసలు ఆస్తమా రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే...  5 మైక్రాన్ల కన్నా తక్కువ వుండే కణాలు సైనస్ లో ఆగకుండా నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్లిపోతాయి. వీటిని బయటకు పంపించేందుకు శరీరం విశ్వప్రయత్నం చేస్తుంది. ఫలితంగానే తుమ్ములు వస్తాయి. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం, ఇంట్లో పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, దుమ్ము, ధూళి ఎక్కువగా వుండే ప్రదేశాల్లో వుండటం వల్ల ఆస్తమాకు కారణమవుతుంది. 
 
ఆస్తమా లక్షణాలు....
తరచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోవడం వుంటుంది. తల బరువుగా అనిపించడమే కాకుండా ముక్కు నుంచి ఆకుపచ్చని, పసుపచ్చని ద్రవం కారుతుంటుంది. ఆస్తమాలో ప్రధానంగా కనిపించేవి దగ్గు, ఆయాసం, పిల్లికూతలు. కొందరిలో అయితే దగ్గు మాత్రమే కనిపిస్తుంది. ఛాతీ పట్టేసినట్లు బరువుగా అనిపిస్తుంది.
 
దీన్ని నిరోధించేందుకు హోమియో మందులు కూడా వున్నాయి. ఈ మందుల వల్ల ఆస్తమాను శాశ్వతంగా నిరోధించవచ్చని వైద్యులు చెపుతున్నారు. ఇంగ్లీషు మందుల ద్వారా ఆస్తమాను తరిమేయడం సాధ్యం కాదని అంటున్నారు.