శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 20 మే 2022 (16:44 IST)

న్యుమోనియా అంటే ఏమిటి? నివారణ ఎలా?

lungs
న్యుమోనియా అనేది ఊపిరితిత్తులలో ఒకదానికి లేదా రెండింటిలో సమస్య తలెత్తడం. ఇది ఊపిరితిత్తుల గాలి సంచులను ద్రవం లేదా చీముతో నింపేలా చేస్తుంది. సంక్రమణకు కారణమయ్యే సూక్ష్మక్రిమి రకం, వయస్సు, మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఇది తేలికపాటి నుండి తీవ్రమైనదిగా కూడా ఉంటుంది.

 
న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎవరికి ఉంది?
ఎవరైనా న్యుమోనియా బారిన పడవచ్చు, కానీ కొన్ని కారకాలు మీ ప్రమాదాన్ని పెంచుతాయి. 2 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, 65 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రసాయనాలు, కాలుష్య కారకాలు లేదా విషపూరిత పొగలకు గురికావడం వల్ల రావచ్చు.

 
ధూమపానం, అధిక మద్యపానం, పోషకాహార లోపం వంటి జీవనశైలి అలవాట్ల వల్ల రావచ్చు. ఆసుపత్రిలో ఉండటం, ప్రత్యేకించి ICUలో ఉన్నట్లయితే, మత్తుగా ఉండటం లేదా వెంటిలేటర్‌పై ఉండటం వలన ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

 
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నవారు, బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నవారు, స్ట్రోక్ లేదా ఇతర పరిస్థితి నుండి దగ్గు లేదా మ్రింగడంలో సమస్య వున్నవారు, జలుబు లేదా ఫ్లూతో బాధపడుతున్నవారు సమస్యను ఎదుర్కొనవచ్చు.

 
న్యుమోనియాకు చికిత్సలు ఏమిటి?
న్యుమోనియా రకాన్ని బట్టి న్యూమోనియాకు చికిత్స ఉంటుంది. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా న్యుమోనియా, కొన్ని రకాల ఫంగల్ న్యుమోనియాకు చికిత్స చేస్తాయి. వైరల్ న్యుమోనియాకు అవి పని చేయవు. కొన్ని సందర్భాల్లో, వైరల్ న్యుమోనియా తగ్గేందుకు యాంటీవైరల్ మందులను సూచించవచ్చు. యాంటీ ఫంగల్ మందులు ఇతర రకాల ఫంగల్ న్యుమోనియాకు చికిత్స చేస్తాయి. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్లయితే, ఆసుపత్రిలో చికిత్స పొందవలసి ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు, అదనపు చికిత్సలను పొందవచ్చు. ఉదాహరణకు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటే, ఆక్సిజన్ థెరపీని పొందవచ్చు.

 
న్యుమోనియా నుండి కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. కొంతమందికి వారంలోపు తగ్గుతుంది. ఇతర వ్యక్తులకు, ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.

 
న్యుమోనియాను నివారించవచ్చా?
న్యుమోకాకల్ బ్యాక్టీరియా లేదా ఫ్లూ వైరస్ వల్ల వచ్చే న్యుమోనియాను నివారించడానికి టీకాలు సహాయపడతాయి. మంచి పరిశుభ్రత, ధూమపానం చేయకపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం కూడా న్యుమోనియాను నివారించడంలో సహాయపడవచ్చు.