టైమ్ పాస్ కోసం తింటున్నారా..? ఐతే జాగ్రత్త సుమా..

గురువారం, 12 జులై 2018 (12:12 IST)

టైమ్ పాస్ కోసం.. ఆకలేయకపోతున్నా.. సరదాగా స్నేహితులతో కలిసి తింటున్నారా..? అయితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆకలిగా లేనప్పుడు తినే తిండి అనారోగ్యం కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ స్థాయులను పరిశీలించడంతో ఈ విషయం వెల్లడి అయినట్లు తెలిసింది. ఆకలి లేనప్పుడు సరదాగా తినే తిండి అనారోగ్యం పాలు చేస్తుందని వైద్యులు చెప్తున్నారు.
 
అలాగే రోజుకు మూడు పూటలు మాత్రమే ఆహారం తీసుకోవాలి. అల్పాహారం, భోజనం, రాత్రిపూట తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. అదీ ఆకలి కలిగినప్పుడే తీసుకోవాలి. అదీ ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలి. స్నాక్స్‌గా కుకీస్, క్యాండీబార్స్, ఐస్ క్రీమ్స్, చిప్స్ తీసుకోకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు అలా కలియతిరగాలి. 
 
సాయంత్రం పూట స్నేహితులతో సరదాగా మాట్లాడాలి. అప్పుడప్పుడు సంగీతం వినడం, ఆడుకోవడం, పిల్లలతో గడపడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే ఉద్వేగానికి లోనైనప్పుడు ఆహారం తీసుకోకూడదు. కోపంగా వుంటే పది నిమిషాల తర్వాత కోపాన్ని నియంత్రిచుకున్నాకే ఆహారం తీసుకోవాలి. అలాకాకుండా ఒత్తిడిలో అధిక ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరిగిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నైట్ డ్యూటీలతో ప్రాణాలకు ముప్పు...

రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పు పొంచివుంది. నైట్ షిప్టుల్లో ...

news

వర్షాకాలంలో వేడివేడి బజ్జీలొద్దు.. నెయ్యిని పక్కనబెట్టేయాల్సిందే..

వర్షాకాలంలో దాహం వేయదు. చెమట పట్టదు. వ్యాయామం చేయాలనిపించదు. శారీరక శ్రమ అంతగా వుండదు. ...

news

పెళ్లి చేసుకుంటేనే మీ 'గుండె' పదిలం... లేదంటే?

పెళ్లి చేసుకుంటేనే మీ గుండె పదిలంగా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. నాలుగు కాలాల పాటు ...

news

ప్రతిరోజూ ఎండుద్రాక్షాలు తీసుకుంటే? పక్షవాతాన్ని నివారించవచ్చా?

కిస్‌మిస్ లేదా ఎండుద్రాక్ష అని పిలిచే ఈ డ్రైఫ్రూట్స్ రుచికరమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ...