కలబంద గుజ్జుతో పళ్లు తోముకుంటే.. నోటి దుర్వాసన..?

కలబంద గుజ్జుతో పళ్లు తోముకుంటే.. నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని దాన్ని టూత్‌పేస్టుపై వేసి దంతాలను తోముకుంటే.. దంత సమస్యలుండవు. దంతాలు, చిగుళ్ల సమస్యలు తొలగిపోతాయి.

selvi| Last Updated: సోమవారం, 9 జులై 2018 (11:33 IST)
గుజ్జుతో పళ్లు తోముకుంటే.. నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని దాన్ని టూత్‌పేస్టుపై వేసి దంతాలను తోముకుంటే.. దంత సమస్యలుండవు. దంతాలు, చిగుళ్ల సమస్యలు తొలగిపోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.


దంతాలపై గార, పాచి తొలగి..దంతాలు తెల్లగా, దృఢంగా మారుతాయి. కలబంద గుజ్జును రోజుకో స్పూన్ తీసుకుంటే.. చ‌ర్మం సంర‌క్షింప‌బ‌డుతుంది. చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మ‌చ్చ‌లు పోతాయి. అలాగే శిరోజాలు ప్ర‌కాశంతంగా మారుతాయి. 
 
వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. శ‌రీరంలో ఏర్ప‌డే క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేసే గుణాలు క‌ల‌బంద‌లో ఉంటాయి. క‌ల‌బంద‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. క‌ల‌బంద‌లో ఉండే యాంటీ ఇన్‌ప్లామేట‌రీ గుణాలు నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయి. 
 
కలబంద హైబీపీని తగ్గిస్తుంది. అధిక బ‌రువు ఉన్న వారు రోజూ క‌ల‌బంద‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. శ‌రీర మెట‌బాలిజాన్ని పెంచి కొవ్వును క‌రిగించే గుణాలు క‌ల‌బంద‌లో ఉంటాయి. అందువ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :