శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 మార్చి 2017 (14:03 IST)

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే : ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో ఆల్ ఉమెన్స్ క్లినిక్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి (అడయార్)లో ఆల్ ఉమెన్స్ క్లినిక్ పేరుతో మహిళల కోసం మల్టీ స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రారంభించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి (అడయార్)లో ఆల్ ఉమెన్స్ క్లినిక్ పేరుతో మహిళల కోసం మల్టీ స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ క్లినిక్‌లో కేవలం మహిళలు మాత్రమే వైద్య సేవలు అందిస్తారు. వైద్యుల వద్ద నుంచి నర్సులు, వైద్య సహాయక సిబ్బంది వరకు మహిళలే ఉండేలా ఈ విభాగాన్ని ప్రారంభించారు. 
 
వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ క్లినిక్‌ను ప్రముఖ గైనకాలజిస్టు, ఆస్పత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ నిత్యా రామమూర్తి, ప్రముఖ సంఘ సేవకురాలు కామాక్షి ఆచ్చిలతో పాటు.. మరికొందరు వైద్యులు పాల్గొని ఈ క్లినిక్‌ను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా డాక్టర్ నిత్యారామమూర్తి మాట్లాడుతూ... చాలా మంది మహిళలు పురుష వైద్యుల వద్ద వైద్యం చేయించుకునేందుకు వెనుకంజ వేస్తుంటారన్నారు. ముఖ్యంగా తమ సమస్యను ఓపెన్‌గా పురుష వైద్యుల వద్ద చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందన్నారు. ముఖ్యంగా.. పైల్స్, రుతస్రావం, వజీనల్ సమస్యలను పురుషుల విపులంగా చెప్పుకోలేరన్నారు. ఇలాంటి వారి కోసం ఈ ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేశామన్నారు. 
 
ఈ విభాగంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహిళా వైద్యులు, సహాయక సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఈ క్లినిక్ 24*7గా పని చేస్తుందన్నారు. ఈ క్లినిక్‌లో అలెర్జీ, రేడియేషన్ ఆంకాలజీ, డెర్మటాలజీ, సైక్రియాట్రీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, డెంటల్, క్లినికల్ న్యూట్రిషన్, ఇంటర్నెల్ మెడిసిన్ తదితర వైద్య సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.