1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 12 జులై 2025 (18:48 IST)

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Dr Krishnamani
హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), డయాబెటిస్ మరియు హైపర్‌టెన్షన్‌ సహా బహుళ కోమోర్బిడిటీ సమస్యలతో పాటుగా అత్యంత తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క సంక్లిష్టమైన, అరుదైన స్థితితో బాధపడుతున్న 72 ఏళ్ల వ్యక్తికి  విజయవంతంగా చికిత్స చేసింది. పదేపదే మూత్రం ఆగిపోతుండటం, ఇన్ఫెక్షన్‌తో పాటుగా సుదీర్ఘ వైద్య చరిత్ర ఉన్నప్పటికీ ట్రాన్సఫర్మేషన్ అనుసరించి  ప్రోస్టేట్ క్యాన్సర్ రోగ నిర్ధారణతో గుర్తించబడిన ఈ రోగి ఇప్పుడు సమగ్ర, లక్ష్య ఆధారిత చికిత్స తర్వాత స్థిరంగా, ఆరోగ్యంగా ఉన్నాడు.
 
ఈ వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం తీవ్రమైన మూత్ర సమస్యలను ఎదుర్కొన్నాడు. మూత్రం సరిగా పోయలేకపోవటం వంటి సమస్యలతో ఆయన ఏఓఐ హైదరాబాద్‌లో ప్రాథమిక సంరక్షణ పొందాడు. అక్కడ అతనికి ఇంటర్మీడియట్ రిస్క్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రేడియోథెరపీ మరియు హార్మోన్ల చికిత్సను అతను పొందాడు. అయినప్పటికీ అతని వ్యాధి తీవ్రత పెరిగింది. అతనికి మరొక ఆసుపత్రిలో బహుళ కీమోథెరపీలతో చికిత్స అందించబడింది.
 
రోగి ఏఓఐ హైదరాబాద్‌కు తిరిగి వచ్చినప్పుడు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ కృష్ణమణి కెవి, తిరిగి బయాప్సీకి సిఫార్సు చేశారు. "రోగికి మొదట మా ఆసుపత్రిలో చికిత్స అందించాము, కానీ తరువాత వేరేచోట అనేక రకాల కీమోథెరపీలు ఆయన తీసుకున్నారు. అతను మా వద్దకు తిరిగి వచ్చినప్పుడు, స్కాన్‌లో తక్కువ పిఎస్ఏ ఉన్నప్పటికీ, వ్యాధి తీవ్రత దృష్ట్యా మేము తిరిగి బయాప్సీని సూచించాము, ఇది అంతర్లీన సమస్యను గుర్తించడానికి దారితీసింది. తగిన చికిత్సతో ముందుకు సాగడానికి మాకు వీలు కల్పించింది. సిఏ ప్రోస్టేట్ రోగులలో, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వారు అతి తక్కువ పిఎస్ఏ కలిగి ఉంటారు, ఇక్కడ ట్రాన్సఫార్మేషన్‌ను తోసిపుచ్చాలి. ట్రాన్సిషనల్  కార్సినోమాను అతని బయాప్సీ సూచించింది. ఎంఎస్ఐ హై&టిఎంబి హై ఉన్న కణితిపై ఎన్ జి ఎస్ చేయబడింది" అని డాక్టర్ కృష్ణమణి కెవి వివరించారు.
 
ఎన్‌జిఎస్ అనేది నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఇది కణితిని చర్య తీసుకోగల ఉత్పరివర్తనాల కోసం విశ్లేషించడానికి సహాయపడుతుంది. అరుదైన కణితులు ఉన్న రోగులు, భారీగా ముందస్తు చికిత్స పొందినవారు లేదా పరిమిత చికిత్స ఎంపిక అవకాశాలు ఉన్నవారు దీనికి తగినవారు. ఈ రోగిలో ఎంఎస్ఐ హై&టిఎంబి హై ఉండటం అతన్ని ఇమ్యునోథెరపీకి అర్హునిగా చేసింది. తరువాత అతను గణనీయమైన క్లినికల్ మెరుగుదలతో ఇమ్యునోథెరపీని పొందాడు. మూడు సంవత్సరాల తర్వాత అతను వ్యాధి రహితంగా వున్నాడు.
 
ఈ నిర్ణయాత్మక దశ సరైన రోగ నిర్ధారణను చేయటానికి కీలకంగా నిరూపించబడింది. రీ-బయాప్సీ రోగి పరిస్థితిపై కీలకమైన అంశాలను తెలుసుకోవటానికి సహాయ పడింది, దీని వలన బృందం బహుళ విభాగ చికిత్సా ప్రణాళికను అభివృద్ధి చేయగలిగింది. ఈ ఖచ్చితత్వ-ఆధారిత  విధానాన్ని అనుసరించి, రోగి గణనీయమైన మెరుగుదలను చూపించాడు. ఇప్పుడు స్థిరమైన ఆరోగ్య స్థితిని సాధించాడు. వైద్య సాహిత్యంలో ఇటువంటి కేసులు చాలా తక్కువగా నివేదించబడ్డాయి.
 
"రోగి వయస్సు, వైద్య చరిత్ర, క్యాన్సర్ యొక్క తీవ్రత స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ కేసును నిర్వహించడం ఒక సవాలు. ఎన్ జి ఎస్ మరియు ఇమ్యునోథెరపీతో కూడిన, సమన్వయంతో కూడిన విధానం ద్వారా, మేము వ్యాధిని నియంత్రించగలిగాము. రోగి యొక్క జీవన నాణ్యతను పెంచగలిగాము" అని హైదరాబాద్‌లోని ఏఓఐ లోని మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె. వి. కృష్ణమణి అన్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా పురుషులలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటిగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ప్రతి సంవత్సరం 1.4 మిలియన్లకు పైగా కొత్త ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. భారతదేశంలో, పట్టణ ప్రాంతాల్లోని పురుషులలో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ గా నిలిచింది, పెరిగిన ఆయుర్దాయం, అవగాహన మరియు తరచుగా పిఎస్ఏ పరీక్షలు చేయించుకుంటున్న కారణంగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
 
"ఈ కేసు వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ సంరక్షణ పట్ల ఏఓఐ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రతి చికిత్సా ప్రణాళిక వ్యక్తి యొక్క వైద్య చరిత్ర, జీవనశైలి, క్యాన్సర్‌కు అనుగుణంగా ఉండేలా మా బహుళ విభాగ బృందాలు నిర్ధారిస్తాయి. హైదరాబాద్‌లో ప్రపంచవ్యాప్తంగా సమలేఖనం చేయబడిన క్యాన్సర్ సంరక్షణను అందించడం మాకు గర్వకారణం" అని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి. అన్నారు. 
 
ఏఓఐ హైదరాబాద్‌లో, నిపుణులైన ఆంకాలజిస్టులు, నిపుణుల బృందం వ్యక్తిగతీకరించిన సంరక్షణతో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానిస్తుంది, సంక్లిష్ట క్యాన్సర్లను ఎదుర్కొంటున్న రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను నిర్ధారిస్తుంది. క్లినికల్ శ్రేష్ఠత మరియు రోగి-కేంద్రీకృత విలువలపై ఆధారపడిన ప్రపంచ స్థాయి క్యాన్సర్ సంరక్షణను అందించడానికి ఏఓఐ కట్టుబడి ఉంది.