గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (10:35 IST)

14న దేశ‌వ్యాప్తంగా మెడిక‌ల్‌షాపుల బంద్‌.. ఆన్‌లైన్ వ్యాపారానికి వ్యతిరేకంగా...

ఆన్‌లైన్ ఫార్మసీ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా ఈనెల 14వ తేదీన దేశ వ్యాప్త సమ్మెకు ఆలిండియా కెమిస్ట్స్ అండ్ డ్ర‌గ్గిస్ట్స్ అసోసియేష‌న్ పిలుపునిచ్చింది. దీంతో ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న మందుల షాపులు మూతపడనున్నాయి. 
 
ఇదే అంశంపై అసోసియేషన్ అధ్యక్షుడు షిండే మాట్లాడుతూ ఆన్‌లైన్ ఫార్మ‌సీ రంగంతో త‌మ భ‌విష్య‌త్ అగ‌మ్య‌గోచ‌రంగా మార‌నుంద‌ని, అందువల్ల ఆన్‌లైన్ ఫార్మసీ మార్కెట్‌పై నిషేధం విధించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. ఈ సంఘంలో దేశ‌వ్యాప్తంగా 8 ల‌క్ష‌ల మంది స‌భ్యులున్నారని, 125 కోట్ల జ‌నాభా ఉన్న భార‌త‌దేశం ఇప్ప‌టికే వైద్య ఆరోగ్య‌రంగాల్లో అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంద‌ని వాపోయారు. 
 
పైగా, డాక్ట‌ర్ల కొర‌త‌తో స‌రైన వైద్య‌సేవ‌లు అంద‌డంలేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. ఈ ఫార్మ‌సీ విధానంతో మ‌రిన్ని స‌మ‌స్య‌లు పెరుగుతాయ‌న్నారు. ఇంట‌ర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొన్ని ఆంక్ష‌ల‌తో అమ్మే మందులు కూడా య‌థేచ్ఛ‌గా అమ్మేస్తున్నారని, ఐపిల్స్‌, మ‌త్తుకు బానిస‌లైన‌వారు కాఫ్ సిర‌ప్‌లు కూడా బుక్ చేసుకునే స‌దుపాయం ఉండ‌డంతో ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మార‌నుంద‌ని హెచ్చ‌రించారు.