రోజూవారి వ్యాయామంతో పాటు.. గుడ్డు తింటే బరువు తగ్గొచ్చు!

Last Updated: ఆదివారం, 14 అక్టోబరు 2018 (10:31 IST)
చాలామంది అధిక బరువుతో పాటు ఊబకాయంతో బాధపడుతుంటారు. ఈ బరువును తగ్గించుకునేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ప్రముఖ న్యూట్రీషియన్‌ రూపాలీ దత్తా మాత్రం సరికొత్త డైట్‌ను వెల్లడించారు.
 
అధిక బరువు తగ్గాలనుకునేవారు రకరకాల వ్యాయామాలు చేయడంతో పాటు విభిన్న డైట్‌లు పాటిస్తుంటారు. అయితే, రూపాలీ దత్తా సూచన మేరకు రోజువారీ వ్యాయామంతో పాటు కోడిగుడ్లను తింటే సులువుగా బరువు తగ్గొచ్చని చెపుతున్నారు. 
 
బరువు తగ్గాలనుకుంటే ఆరోగ్యకరమైన డైట్‌ పాటించాలని, అందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండాలని ప్రముఖ న్యూట్రీషియన్‌ రూపాలీ దత్తా తెలిపారు. 
 
కోడిగుడ్లలో ఇవి పుష్కలంగా ఉంటాయని, జీవక్రియను మెరుగుపరుస్తాయన్నారు. పైగా హెడీఎల్‌ అనే మంచి కొలెస్ట్రాల్‌ ఉండటంతో అధిక బరువు పెరగకుండా ఉంటారని చెప్పారు. దీనిపై మరింత చదవండి :