శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 14 అక్టోబరు 2020 (22:16 IST)

పల్మనరీ ఫిబ్రోసిస్‌ చికిత్స కోసం నిన్డానిబ్‌(నిన్టేడానిబ్‌)ను పరిచయం చేసిన గ్లెన్‌మార్క్‌

పరిశోధనాధారిత, అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ నేడు నిన్డానిబ్‌ (నిన్టేడానిబ్‌ 100 మరియు 150 ఎంజీక్యాప్సూల్స్‌)ను పల్మనరీ ఫిబ్రోసిస్‌ చికిత్స కోసం భారతదేశంలో ఆవిష్కరించింది. శ్వాససంబంధిత ఔషధాల విభాగంలో అగ్రగామిగా ఉన్నటువంటి గ్లెన్‌మార్క్‌, భారతదేశంలో పల్మనరీ ఫిబ్రోసిస్‌ చికిత్స కోసం అత్యంత అందుబాటు ధరలో బ్రాండెడ్‌ జెనరిక్‌ వెర్షన్‌ను ఆవిష్కరిస్తోన్న మొట్టమొదటి సంస్థగా నిలిచింది. ఇది రోగులకు మరింత ప్రభావవంతమైన చికిత్సావకాశాన్ని అందించడంతో పాటుగా దేశంలో విస్తృతస్థాయిలో రోగులకు చికిత్సనందించడమూ డాక్టర్లకు సాధ్యమవుతుంది.
 
నిన్టేడానిబ్‌ను భారత ఔషధ నియంత్రణ సంస్ధ అనుమతించింది. దీనిని ఇడియోపాతిక్‌ (తెలియని కారణాలు) పల్మనరీ ఫిబ్రోసిస్‌ (ఐపీఎఫ్‌) చికిత్స కోసం వినియోగిస్తారు. ఐపీఎఫ్‌ అనేది అభివృద్ధి చెందే వ్యాధి. కొంతకాలానికి దీనివల్ల పరిస్ధితులు దిగజారతాయి. ముందుగానే గుర్తించి చికిత్స చేయడం మరియు చికిత్సను కొనసాగించడం వల్ల వ్యాధి వేగాన్ని నెమ్మదింపజేయవచ్చు. అతి తక్కువ నెలవారీ ఖర్చు అనేది దీర్ఘకాలంలో రోగులు తమకు నిర్ధేశించిన చికిత్సను పొందడంలో అత్యంత కీలకంగా మారుతుంది.
 
ఇప్పటివరకూ నిన్టేడానిబ్‌ను పలు నియంత్రిత క్లీనికల్‌ అధ్యయనాలలో విస్తృతంగా పరీక్షించారు. అక్కడ ఇది సమర్థవంతంగా పనిచేయడంతో పాటుగా సురక్షితమని నిరూపితమైంది. ఇటీవలనే ప్రచురించిన ఇన్‌బిల్డ్‌ ట్రయల్‌లో నిన్టేడానిబ్‌ గణనీయంగా ఎఫ్‌వీసీ (ఫోర్స్‌డ్‌ వైటల్‌ కెపాసిటీ)లో వార్షిక రేటును తగ్గించినట్లుగా నిర్థారించబడింది. ఊపిరితిత్తుల ఆరోగ్యం కనుగొనేందుకు ఉపయోగించే పద్ధతి ఎఫ్‌సీవీ. అంతేకాదు, సార్స్-కోవ్‌ 2 చికిత్సలో నిన్టేడానిబ్‌ సమర్థత, భద్రతను పరీక్షించేందుకు రెండు క్లీనికల్‌ ట్రయల్స్‌ను సైతం నిర్వహిస్తున్నారు. దీనిద్వారా కారణంగా తేలికపాటి నుంచి తీవ్రమైన కోవిడ్-19 రోగులలో వచ్చే పల్మనరీ ఫిబ్రోసిస్‌ చికిత్సలో  ఉపయోగాన్ని అధ్యయనం చేస్తున్నారు.
 
‘‘పరిమిత అవకాశాలు మాత్రమే లభ్యమవుతుండటం చేత ఇంటర్‌స్టిషియల్‌ ఊపిరితిత్తుల వ్యాధి, భారతదేశంలో చికిత్స పరంగా పెను సవాలుగా మారుతుంది. నూతన చికిత్సలో అత్యధిక ధరలు మరియు ప్రస్తుతం లభ్యమవుతున్న అవకాశాలలో మాత్రల భారం కారణంగా రోగులు చికిత్సకు కట్టుబడటం లేదు. నిన్డానిబ్‌ పరిచయంతో, భారతదేశంలో రోగులకు మాత్రలు, ఖర్చు భారాన్ని తగ్గించలమని భావిస్తున్నాం’’ అని శ్రీ అలోక్‌ మాలిక్‌, గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌, ఇండియా ఫార్ములేషన్స్‌ అన్నారు. 
 
ఆయనే మాట్లాడుతూ, ‘‘నిర్థిష్టమైన, తరచుగా భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా చికిత్సకు కష్టమయ్యేవ్యాధులకు సృజనాత్మక ఆరోగ్య సంరక్షణ ఫలితాలను అందించేందుకు గ్లెన్‌మార్క్‌ తమ ఆవిష్కరణలను కొనసాగించనుంది’’ అని అన్నారు.
 
పల్మనరీ ఫిబ్రోసిస్‌(పీఎఫ్‌) అనేది శ్వాససంబంధిత స్థితి. ఊపిరితిత్తులు గట్టిపడటం మరియు/లేదా ఊపిరితిత్తులలో గీతలు పడటం దీనిలో కనిపించే లక్షణాలు. ఈ కారణాల చేత గాలి తిత్తుల ద్వారా ఆక్సిజన్‌ రక్త ప్రవాహంలో కలువడం కష్టంగా మారుతుంది. ఈ కారణం చేతనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడి దగ్గు వస్తాయి. ఐపీఎఫ్‌ వచ్చిన రోగులలో జీవించి ఉండేందుకు అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. ఈ వ్యాధిని కనుగొన్న తరువాత ఐదేళ్లలో కేవలం 20-30 % మాత్రమే బ్రతికి ఉంటారు. ఈ మరణాలకు ప్రధాన కారణం శ్వాసవ్యవస్థ విఫలం కావడం. ఐపీఎఫ్‌ సాధారణంగా భారతదేశంలో 65 సంవత్సరాలు దాటిన పురుషులలో కనిపిస్తుంటుంది. ఒకవేళ దీనిని గుర్తించినప్పటికీ సరైన చికిత్స అందించని ఎడల మూడు నుంచి  ఐదేళ్లు మాత్రమే ఐపీఎఫ్‌ రోగులు జీవించగలరు.