శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (14:13 IST)

యువతకు వార్నింగ్... వారానికి 20 గ్లాసుల బీరు సేవించారో...

మందు బాబుల ఆరోగ్యంపై తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం యువతతో పాటు తాగుబోతులకు ఓ హెచ్చరికలా మారింది. వారానికి 20 నుంచి 40 గ్లాసుల బీరును సేవించేవారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని తేల్చింది. 
 
నిజానికి ప్రతి రోజూ మితంగా మద్యం లేదా వైన్ సేవిస్తే పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారని పలు పరిశోధనలు వెల్లడించాయి. కానీ, తాజాగా నిర్వహించిన అధ్యయనం మాత్రం ప్రాణముప్పు తప్పదని హెచ్చరిస్తోంది. 
 
నిత్యంమితంగా మద్యం లేదా వైన్‌ సేవిస్తే పదికాలాల పాటు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పలు అథ్యయనాలు వెల్లడైనా తాజా అథ్యయనం మద్యం ప్రియులకు షాక్‌ ఇస్తోంది. వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసుల వైన్‌, 9 గ్లాస్‌ల బీర్‌ను పుచ్చుకున్నా అకాల మరణం తప్పదని మెడికల్‌ జర్నల్‌ ది లాన్సెట్‌ స్పష్టం చేసింది. 
 
19 దేశాల్లోని ఆరు లక్షల మంది మందు బాబులపై ఈ పరిశోధన జరిగింది. మద్యాన్ని ఎక్కువగా సేవించే వారు స్ట్రోక్‌, గుండె వైఫల్యం వంటి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ముప్పు అధికంగా ఉందని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ పత్రిక వెల్లడించింది. 
 
ముఖ్యంగా, వారానికి 200 గ్రాముల నుంచి 350 గ్రాములు అంటే వారానికి 10 నుంచి 18 గ్లాసుల వరకూ వైన్‌, 20 నుంచి 40 గ్లాసుల వరకూ బీరును తీసుకునేవారు సగటు జీవితకాలంలో రెండేళ్లకు ముందే మృత్యువాతన పడతారని తెలిపింది. 
 
ప్రపంచవ్యాప్తంగా మద్యం సేవించడంపై ఉన్న అధికారిక గైడ్‌లైన్స్‌ను సవరించాల్సిన అవసరం ఉందని ది లాన్సెట్‌లో ప్రచురితమైన అథ్యయనం తెలిపింది. ఇక ప్రతివారం ఆరు గ్లాస్‌ల వైన్‌, అదే మోతాదులో బీర్‌ను తీసుకోవాలని, అంతకుమించి మద్యం సేవించడం ఆరోగ్యానికి చేటని బ్రిటన్‌ ఇటీవల తాజా మార్గదర్శకాలను జారీచేసింది.