Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రతి ఇంటిలోనూ ఉండాల్సిన మధురపలం దానిమ్మతో షుగర్‌కి చెక్

హైదరాబాద్, శనివారం, 8 జులై 2017 (06:41 IST)

Widgets Magazine
pomegranate

మధుమేహ రోగులు ఈ ప్రపంచంలో నాలుగు వస్తువులు లేవనుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అవేమంటే మామిడిపండు, పనసపండు, సీతాఫలం, సపోటా. ఈ నాలుగు పళ్లూ అత్యంత తీపిని కలిగి ఉండి షుగర్ రోగుల దేహాలను లోపల్నుంచే కుళ్లబొడిచేస్తాయి కాబట్టి వాటిని తినడం కాదు కదా. వాసన కూడా పీల్చకూడదని  డాక్టర్లు చెబుతుంటారు. అలాగే షుగర్ పేషెంట్లు నిత్యం ఆహారంలో భాగంగా తీసుకోవలసిన పళ్లు కూడా ఉన్నాయి. అవేమంటే బొప్పాయి, జామకాయ, నేరేడు, దానిమ్మ. వీటిలో నాలుగవదైన పండు ప్రతి ఇంట్లో ఉండాల్సిన పండని, షుగర్, బీపీకి సంబంధించిన సమస్త అంశాలను ఇది అదుపులో ఉంచుతుందని చెబుతుంటారు.
 
దానిమ్మ మదుమేహ రోగులకు అమృతసమానమైన మధురపలం. దానిమ్మలో చక్కెర పాళ్లు తక్కువ, డయాబెటిస్‌ వారికీ ఉపయోగకరం.   దానిమ్మలో జీర్ణక్రియకు ఉపకరించే పీచు సమృద్ధిగా ఉంటుంది. మలబద్దకం దరిచేరదు.  ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫీనోల్స్, యాంటి ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. ఈ ఫైటో కెమికల్స్‌ శరీర నిర్మాణ పోషకాలను సమకూర్చడంతో పాటు చక్కటి రోగనిరోధక శక్తినిస్తాయి.  
 
దానిమ్మలో విటమిన్‌ కె, విటమిన్‌ బి5, విటమిన్‌ సి ఎక్కువ. ఇవి ప్రోస్టేట్, బ్రెస్ట్, కోలన్‌ క్యాన్సర్, లుకేమియా వంటి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి.కొలెస్టరాల్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా ఇస్కిమిక్‌ కరోనరీ హార్ట్‌ డిసీజ్‌ను నివారిస్తుంది. గుం

డె సమస్యలున్న వాళ్లు రోజూ ఒక గ్లాసు దానిమ్మరసం తీసుకుంటే మంచిది. చర్మం పై పొరను కాపాడుతుంది, చర్మకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మేను మిలమిల మెరిసేలా దోహదపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ముడతలు, మచ్చలు, గీతలను నివారిస్తుంది. ఎండకు వెళ్లినప్పుడు చర్మం వడలిపోకుండా రక్షిస్తుంది. వాపులను, నొప్పులను తగ్గిస్తుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ప్రతిరోజు ఆహారంలో మొదటి ముద్దను కరివేపాకు పొడితో తింటే...?

తాలింపులో సుగంధద్రవ్యంగా కరివేపాకును వాడుతారు. ఈ విధంగా అవసరానికి మన ఇంట్లో లేకపోయినా ...

news

నిద్ర పట్టడం లేదా.. అయితే, ఇలా చేయండి...

చాలామందికి రాత్రి వేళల్లో నిద్రపట్టదు. మరికొందరు బాగా పొద్దుపోయాకగానీ నిద్రకు ...

news

టాబ్లెట్లు ఎలా వేసుకోవాలి? మాత్ర చేదుగా వుందనీ...

సాధారణ జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వటం అతి సహజం. అయితే మాత్రలు మింగటానికి మనం ...

news

కడుపుకి నిత్యం ఇవి పట్టిస్తుంటే ఇక సుఖనిద్ర ఎలా వస్తుంది నాయనా?

నేటి జీవితంలో 8 గంటల పని తర్వాత ఇంటికి వచ్చి కాస్సేపు జీవన సహచరి లేదా సహచరుడితో, పిల్లలతో ...

Widgets Magazine