శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 29 జూన్ 2016 (11:14 IST)

మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో పామ్‌ఆయిల్ ఉపయోగిస్తున్నారట.. అదీ 16 రోజుల పాతనూనెనే..?!

ఆధునిక కాలంలో చాలామంది ఫాస్ట్‌ఫుడ్‌కి అలవాటుపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌కి అలవాటు పడ్డవారు రోజూ ఏదో ఒకటి తిననిదే వారికి నిద్ర పట్టదు. రోడ్డు సైడ్ ఫుడ్, కే.ఎఫ్.సి, మెక్‌డొనాల్డ్స్

ఆధునిక కాలంలో చాలామంది ఫాస్ట్‌ఫుడ్‌కి అలవాటుపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌కి అలవాటు పడ్డవారు రోజూ ఏదో ఒకటి తిననిదే వారికి నిద్ర పట్టదు. రోడ్డు సైడ్ ఫుడ్, కే.ఎఫ్.సి, మెక్‌డొనాల్డ్స్, డామినోస్ వంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో టేస్ట్ బాగుందని తెగలాగించేస్తుంటారు. రుచిగా ఉండడం వరకు ఒకే గాని వాటివల్ల మన ఆరోగ్యానికి ఎంతో కీడు జరుగుతుందని ఆలోచించరు. 
 
ఇకపోతే ఇలాంటి రెస్టారెంట్ల గురించి కొన్నిభయంకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలే రెస్టారెంట్లలో ఆరోగ్య శాఖవారు తరచూ తనిఖీలు చేపడుతున్నారు. జైపూర్‌లోని మూడు మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా… వారు 16రోజుల పాత నూనెనే వంటల్లో ఉపయోగిస్తున్నారని తేలింది. ఈ నిజం తెలుసుకున్నఆరోగ్యశాఖవారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. 
 
16 రోజులనుండి ఒకే నూనెను వాడుతున్నారని…. ఆ నూనెను 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో రోజు వాడడంతో అది నల్లగా మారినా.. అదే నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా... మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో పామ్‌ఆయిల్‌ను వాడుతున్నారు. ఇతర నూనెలతో పోలిస్తే పామ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా కీడు చేస్తుంది. మరి ఇలాంటి దారుణానికి పాల్పడిన ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో ఇంకెప్పుడైనా తినే ముందు ఒక్కసారి ఆలోచించడం మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం గుర్తుంచుకోండి సుమా...!