ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By వాసుదేవన్
Last Modified: శుక్రవారం, 27 డిశెంబరు 2019 (18:31 IST)

తస్సాదియ్యా... 38 ఏళ్లు బతకాల్సినోళ్లు, 100 ఏళ్లు బ్రతుకుతున్నారే?

సగటు మనిషి జీవితకాలం ఎంత? అనే ప్రశ్నకు ఇప్పటివరకు నూరేళ్లని, నిండు నూరేళ్లు అనే వాళ్లనీ, లేదండీ.. మహా 60, 70 ఏళ్లు అనే వాళ్లనీ ఇప్పటివరకు చూసి ఉంటాం... కానీ, మానవ జీవితకాలం గరిష్ఠంగా 38 సంవత్సరాలు మాత్రమేనని తేల్చేసారు ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు.
 
ఒక మనిషి ఎన్నేళ్లపాటు బతికినా, వారి సహజసిద్ధ ఆయుర్దాయం 38 ఏళ్లు మాత్రమేనని తొలినాటి ఆధునిక మానవ జన్యు గడియారం ఆధారంగా గుర్తించినట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న బెన్ మేన్ వెల్లడించారు. తొలినాటి ఆధునిక మానవ ఆయుర్దాయంపై తాము వేసిన అంచనాలతో ఇది సరిపోయిందనీ... అయితే, కొన్ని శతాబ్దాలుగా జరిగిన మార్పులు, వైద్య శాస్త్రంలో పురోగతి, జీవన ప్రమాణాల మెరుగు తదితర కారణాలతో జీవితకాలం పెరిగిందనీ ఆయన అన్నారు.  
 
కాగా, కాలగర్భంలో కలసిపోయిన వూలీ మామోత్, నియాండెర్తల్ జాతుల్లోని మనుషుల జీవితకాలాన్ని ఈ పరిశోధన వెలుగులోకి తీసుకుని వచ్చింది. 'డీఎన్ఏ మిథలైజేషన్' అనే జన్యు మార్పు, వెన్నెముక ఉండే జీవుల్లో గరిష్ఠ జీవన స్థాయి ఎంత అన్న విషయాన్ని తేలుస్తుందని బెన్ మేన్ వెల్లడించారు. ఈ జన్యు గడియారమే జన్యువులు ఎప్పుడు యాక్టివేట్ కావాలన్న విషయాన్ని నిర్ధారించేందుకు సాయం చేస్తుందని, 42 రకాల జన్యువుల్లో మిథైలేషన్ సాంధ్రత ఆధారంగా కచ్చిత ఆయుర్దాయాన్ని అంచనా వేయవచ్చునని ఆయన తెలియజేసారు.
 
ఈ లెక్కన చూస్తే... సగటు మనిషి జీవిత కాలం గరిష్టంగా 38 ఏళ్లు కాగా... మిగిలిందంతా బోనస్సేనట..