Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెల్ ఫోన్ రేడియేషన్ పుణ్యంతో పిచ్చుకలు మాయం.. కాపాడండి.. మహాప్రభో..!

సోమవారం, 20 మార్చి 2017 (15:25 IST)

Widgets Magazine

ఆధునీకరణ పేరుతో ప్రకృతి సంపద కనుమరుగువుతూ వస్తున్నాయి. నగరాభివృద్ధి కోసం భవనాల సంఖ్య పెరిగిపోతున్న వేళ.. వృక్షాలు తగ్గిపోతున్నాయి. దీంతో వర్షాలు సైతం కురవట్లేదు. క్రమ క్రమంగా ప్రకృతి మానవాళికి దూరమవుతున్న తరుణంలో వాటిని ఆధారంగా చేసుకుని జీవించే పక్షుల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తోంది. తాజాగా సెల్ ఫోన్ల పుణ్యంతో పిచ్చుకలు మాయమైపోతున్నాయి. 
 
చిన్న చిన్న రెక్కలతో టపటపలాడిస్తూ నిత్యం మనల్ని పలకరించే జీవులు ప్రస్తుతం కనుమరుగు అవుతున్నాయి. జీవవైవిధ్యానికి ప్రతీకలుగా ఉన్న ఈ పక్షులు హైటెక్ సిటీగా పేరున్న హైదరాబాదులో బాగా తగ్గిపోయాయి. నేడు ''వరల్డ్ స్పారో డే'' ఈ రోజును పురస్కరించుకుని పిచ్చుకల సంఖ్యను పెంచేందుకు మనవంతు సాయం చేయాలని ఆశిద్దాం..
 
ఫ్లాట్ కల్చర్, సెల్ ఫోన్ల రేడియేషన్ కారణంగా పిచ్చుల ఉనికి కనుమరుగైంది. రాష్ట్రవ్యాప్తంగా 450 పక్షి జాతులు మనుగడలో ఉంటే హైదరాబాద్‌లో ఊరపిచ్చుకలతోపాటు 40 రకాల పక్షులే ఉన్నాయి.
 
అదే దేశ రాజధాని ఢిల్లీలో పిచ్చుకల ఆనవాళ్లు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ పక్షి ఢిల్లీ రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందినప్పటికీ.. వాతావరణ కాలుష్యం, సెల్‌ఫోన్ రేడియేషన్ కారణంగా పిచ్చుకల సంఖ్య తగ్గిపోయింది. జనాభా పెరిగిపోవడం.. వృక్ష సంపద లేకపోవడం కారణంగా చిన్ని జీవాలైన పిచ్చుకలు కనిపించట్లేదు. కిటికీలు, వెంటిలేటర్లపై కీచ్ కీచ్‌మంటూ అరుస్తూ పలకరించే పిచ్చుకలు ప్రస్తుతం ఏమయ్యాయోనని మూగజీవాల ప్రేమికులు వాపోతున్నారు. చెట్లను నరికేయడం ద్వారా చిట్టి పక్షులు నివాసం కోల్పోతున్నాయి. ఇంకా వాతావరణ కాలుష్యమే కాకుండా శబ్ధ కాలుష్యంతో చిట్టి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
అందుకే చిట్టి చిట్టి ప్రాణాలను కాపాడుకోవాలంటే.. బాల్కనీల్లో, ఇంటి నీడల్లో కనిపించే పక్షుల కోసం గూళ్లను ఏర్పాటు చేయండి. చిన్న నీటి తొట్టెల్లో నీటిలో అందుబాటులో ఉంచాలి. కాలనీల్లో, ఖాళీస్థలాల్లో పక్షుల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేయాలి. అలాగే డాబాల మీద చిన్న చిన్న మొక్కలను పెంచాలని పరిశోధకులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

టీ తాగు హాయ్ హాయ్... మతిమరుపు నై నై..

టీ కెటిల్‌ నుంచి వస్తున్న కమ్మని వాసనను ఆఘ్రాణిస్తూ... గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. ...

news

బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి చిన్నారులకు తినిపిస్తే?

బొప్పాయి గుజ్జుని ఇన్ఫెక్షన్ చేరిన ప్రాంతంలో లేదా కాలిన గాయాల మీద పెట్టడం వల్ల అని త్వరగా ...

news

డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కీరదోస మేలు..

డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కీరదోస కాయను అధికంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది ...

news

వేరుశెనగ నూనెను వాడండి.. అంటువ్యాధులను దూరం చేసుకోండి..

వేరుశెనగలో యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ ...

Widgets Magazine