శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (15:37 IST)

బాయ్‌ఫ్రెండ్‌ సెక్స్‌ చేస్తుంటే.. కండోమ్ చిరిగింది.. గర్భం వస్తుందా?

నా బాయ్‌ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఒక రోజున హోటల్ గదిలో సెక్స్ చేస్తుంటే.. కండోమ్ చిరిగిపోయింది. ఈ విషయం సెక్స్ పూర్తయిన తర్వాతే తెలిసింది. దీనివల్ల బాయ్‌ఫ్రెండ్ స్ఖలించిన వీర్యమంతా యోనిలోకి వెళ్లినట్టుంది. అప్పటి నుంచి భయం పట్టుకుంది. గతంలో పలు మార్లు సెక్స్‌లో పాల్గొన్నా ఎపుడు కూడా ఇలాంటి సమస్య ఎదురుకాలేదు. ఇపుడు యోనిలోకి వెళ్లిన వీర్యం వల్ల గర్భం వస్తుందా? సలహా ఇవ్వండి.
 
గర్భం వస్తుందా రాదా అనేది రుతుచక్రం రోజులను బట్టి ఉంటుంది. మెన్సస్ అయిన తొలి 15 రోజుల్లో ముఖ్యంగా పదో రోజు నుంచి 15వ రోజు లోపు సెక్స్‌లో పాల్గొనివుంటే గర్భం వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోండి. 
 
ఇకపోతే... చాలా సందర్భాల్లో సెక్స్‌లో పాల్గొన్నపుడు చాలా మంది యువకులు కండోమ్ ధరిస్తుంటారు. అయితే, కండోమ్ ధరించి సెక్స్‌ చేసే సమయంలో కొన్నిసార్లు కండోమ్ చిరికి పోవడం జరుగుతుంది. నాసికరకం కండోమ్‌లు ఉపయోగించడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. సెక్స్ మధ్యలో ఉండటంతో చివరకు సెక్స్‌ను అలాగే పూర్తి చేస్తుంటారు. 
 
కండోమ్ లేకుండా పర స్త్రీలతో సెక్స్‌లో పాల్గొనడం ఎప్పటికీ మంచిది కాదు. అది సుఖవ్యాధులకు, హెచ్.ఐ.విలకు దారితీయవచ్చని చెపుతున్నారు. ఒకవేళ కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొన్న వారం రోజుల తర్వాత.. మూత్రం విసర్జన సమయంలో మంట, నొప్పి, మూత్రంలో చీము, నెత్తురు పోవడం అంగం పైన ఏదైనా అల్సర్లు లేదా కురుపులు వచ్చాయో లేదా నిశితంగా గమనించాలని సూచిస్తున్నారు.